Covid 19 Third Wave: కరోనా థర్డ్ వేవ్.. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలపై పేలుతున్న జోకులు, మీమ్స్!!

భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 08:03 PM IST
  • భారతదేశంలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు
  • ఫిబ్రవరిలో కరోనా థర్డ్ వేవ్
  • ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలపై పేలుతున్న జోకులు
Covid 19 Third Wave: కరోనా థర్డ్ వేవ్.. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలపై పేలుతున్న జోకులు, మీమ్స్!!

 Covid 19 Third Wave: Netizens trolls Delhi, Kerala and Maharashtra with Memes: భారత దేశంలో కరోనా వైరస్ (Coronavirus) కేసులపై కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా తాజా కేసుల్లో అనూహ్య పెరుగుదలే ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా 10 వేలకు దిగువనే నమోదవుతున్న కేసులు.. తాజాగా 16 వేలకు పైగా నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 16764 కరోనా కేసులు నమోదు కాగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి చేరింది. ఒక్క రోజులోనే ఒమిక్రాన్ కేసులు 30 శాతం మేర పెరగడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. దేశ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. 

వేగంగా విస్తరిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. అత్యధికంగా మహారాష్ట్ర (Maharashtra)లో 450 కేసులు నమోదు కాగా.. ఢిల్లీ (Delhi)లో 320 కేసులు నమోదయ్యాయి. ఇక కేరళ (Kerala)లో 100కే పైగా కేసులు ఉన్నాయి. భారత (India) దేశంలో ప్రతిరోజూ అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కేరళలు ముందున్నాయి. అంతకుముందు కూడా ఈ మూడు రాష్ట్రాలలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మొదటి, రెండో వేవ్‌లలో ఈ మూడు రాష్ట్రాల్లోనే అధిక ప్రభావం చూపింది.

Also Read: Telangana liquor sales: మద్యం అమ్మకాల్లో తెలంగాణ కొత్త రికార్డు- నెలలో రూ.3,350 కోట్ల విక్రయాలు!

భారతదేశంలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కొన్ని రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ కూడా విధిస్తున్నాయి. ఇక ఫిబ్రవరిలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ (Covid 19 Third Wave) వస్తుందని నిపుణులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ (Memes) ట్రెండ్ అవుతున్నాయి. ప్రతిసారి ఈ మూడు రాష్ట్రాలు ఎందుకు ముందంజలో ఉన్నాయి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు పలు బాలీవుడ్ మరియు టీవీ షోల చిత్రాలను మీమ్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. అవి ఎంతో సరదాగా ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Lala Bheemla Song DJ: లాలా భీమ్లా డీజే సాంగ్ వచ్చేసింది.. న్యూఇయర్ నైట్ ఇక రచ్చరచ్చే! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News