Section 144 Imposed: రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు.. న్యూఇయర్ వేడుకలపై బ్యాన్ విధించిన ప్రభుత్వం

Maharastra Imposed 144 Section: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వైరస్ భయాందోళనల మధ్య ముంబయి నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు, న్యూఇయర్ వేడుకలను నిషేధిస్తున్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 10:52 AM IST
Section 144 Imposed: రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు.. న్యూఇయర్ వేడుకలపై బ్యాన్ విధించిన ప్రభుత్వం

Maharastra Imposed 144 Section: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంలో పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు కూడా ముంబయిలో వేగంగా వ్యాపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబయి నగరమంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణ మార్గదర్శకాల ప్రకారం.. డిసెంబరు 30 నుంచి జనవరి 7 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు, బార్ లు, పబ్ లు, రిసార్ట్స్, క్లబ్ లు సహా అనేక బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

"ఈ ఉత్తర్వుల ప్రకారం డిసెంబరు 30 అనగా గురువారం రాత్రి 12 గంటల నుంచి గ్రేటర్ ముంబయి నగర పరిధిలో ఉన్న అనేక ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు జరుగుతుంది. 2022 జనవరి 7 వరకు ఇది అమలవుతుంది. నిబంధలను ఉల్లంఘించిన వారిపై అంటువ్యాధుల చట్టం 1897, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం చట్టపరమైన నిబంధనలతో పాటు భారతీయ శిక్షాస్మృతి 180 ప్రకారం శిక్షార్హులు అవుతారు" అని ముంబయి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ చైతన్య తెలిపారు.

మరోవైపు మహారాష్ట్రలోనూ కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే ముంబయిలో 2,510 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా ధాటికి నగరంలో ఒకరు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య బులిటిన్ తెలియజేసింది. 

ముంబయిలో ప్రస్తుతం 8,060 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నగరంలో కరోనా రికవరీ రేట్ 97 శాతంగా ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ముంబయిలోని 45 భవనాలకు మున్సిపల్ అధికారులు సీల్ వేశారు. మహారాష్ట్ర కేబినేట్ మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు దగ్గరుండి చర్యలు చేపడుతున్నారు.   

Also Read: Covid-19 Cases: ముంబైలో ఈ రోజు పక్కా 2000కు పైగా కోవిడ్ కేసులు.. సీఎం కుమారుడు వార్నింగ్

Also Read: PM-KISAN Scheme: ప్రధాని న్యూ ఇయర్ గిఫ్ట్...జనవరి 1న పీఎం కిసాన్ నిధుల విడుదల!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News