COVID-19 Lockdown: నేటి నుంచి లాక్‌డౌన్ అమలవుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవే

COVID-19 Lockdown In India: ప్రతిరోజూ 4 లక్షలకు పైగా కరోనా కేసులు, ఇటీవల కరోనా మరణాలు సైతం 4 వేలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. ప్రాణ నష్టాన్ని నివారించడం, వైరస్‌పై విజయం సాధించడానికి లాక్‌డౌన్ విధిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 10, 2021, 08:24 AM IST
COVID-19 Lockdown: నేటి నుంచి లాక్‌డౌన్ అమలవుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవే

COVID-19 Lockdown: కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రతిరోజూ 4 లక్షలకు పైగా కరోనా కేసులు, ఇటీవల కరోనా మరణాలు సైతం 4 వేలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. లాక్‌డౌన్ వల్ల కలిగే ఆర్థిక నష్టంపై అవగాహనా ఉన్నప్పటికీ, అంతకు మించి విలువైన ప్రాణ నష్టాన్ని నివారించడం, వైరస్‌పై విజయం సాధించడానికి లాక్‌డౌన్ విధిస్తున్నారు. అదే సమయంలో భారీగా వ్యాక్సినేషన్లు జరగకపోతే ప్రయోజనం లేదని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌(Lockdown)ను ప్రస్తుతానికి మే 17 ఉదయం 5 గంటలవరకు పొడిగించారు. ఏప్రిల్ 19 నుంచి ఢిల్లీలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో లాక్‌డౌన్ విధించారు. మధ్యప్రదేశ్‌లో ఈనెల 15వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్, హిమాచల్ ప్రదేశ్‌లో ఈనెల 16 వరకు అమలులో ఉంది.

Also Read: Health Tips: ఉప్పు అధికంగా తింటే Heartకు ముప్పు అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా కర్ఫ్యూను పొడిగిస్తూ మే 9న నిర్ణయం తీసుకుంది. యూపీలో మే 17 వరకు పాక్షిక కర్ఫ్యూ అమలులో ఉండనుంది. యూపీలో ఏప్రిల్ 29 నుంచి కరోనా కర్ఫ్యూ విధించడం ప్రారంభించారు. హర్యానా ప్రభుత్వం మే 17 వరకు లాక్‌డౌన్ విధించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కరోనా కర్ఫ్యూ మే 17 ఉదయం 7 గంటల వరకు అమలులో ఉంటుంది. 

రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏకంగా మే 24 ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించింది. ప్రజలు గుమిగూడటం, వివాహాలు, ఇతరత్రా కార్యక్రమాలను నిర్వహించడంపై మే 31 వరకు నిషేధం అమలులో ఉండనుంది. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలో రెండు వారాలపాటు లాక్ డౌన్ విధించారు. మే 10వ తేదీ అర్ధరాత్రి నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. 

Also Read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న నిపుణులు

నూతనంగా ఏర్పడిన ఎంకే స్టాలిన్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా తమిళనాడు(Tamil Nadu Lockdown)లో మే 24 వరకు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న మరో రాష్ట్రం కర్ణాటకలో సీఎం బీఎస్ యెడియూరప్ప(BS Yediyurappa) మే 10 నుంచి మే 24 వరకు లాక్‌డౌన్ విధించారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి కల్పించారు. హోటల్, బార్‌లు, షాపులు మూసివేయాలని ఉత్తర్వులలో పేర్కొంది.

Also Read: Tata Motors: కార్ల ధరలు పెంచేసిన టాటా మోటార్స్, లేటెస్ట్ రేట్లు ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News