Covid-19 India: దేశంలో నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కోవిడ్ మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కొన్ని రోజులనుంచి ప్రతిరోజూ 15 నుంచి 18 వేల కేసులు నమోదవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2021, 09:53 AM IST
Covid-19 India: దేశంలో నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు

India Coronavirus Latest Updates | న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కొన్ని రోజులనుంచి ప్రతిరోజూ 15 నుంచి 18 వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) కొత్తగా 13,788 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 145 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా (Corona cases) కేసుల సంఖ్య 1,05,71,773 కి చేరగా.. మరణాల సంఖ్య 1,52,419 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

ఇదిలాఉంటే.. కేసులతోపాటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. నిన్న కరోనా (Coronavirus) నుంచి 14,457 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా (cured cases) 1,02,11,342 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో (active cases) ప్రస్తుతం 2,08,012 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 96.59 శాతం ఉండగా.. మరణాల రేటు 1.44 శాతం ఉంది. Also Read: COVID-19 vaccination: తొలి రోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం

దేశవ్యాప్తంగా నిన్న 5,48,168 కరోనా (Covid-19) నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. వీటితో కలిపి జనవరి 17వ తేదీ వరకు మొత్తం 18,70,93,036 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది. Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News