COVID-19 New Wave: కరోనా కొత్త వేవ్ ఏర్పడేందుకు దారితీసే 4 పరిస్థితులు ఇవే

COVID-19 new wave: కేంద్ర ఆరోగ్యశాఖ కోవిడ్19పై నిర్వహించిన మీడియా సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ న్యూ పాండామిక్ ఎలా తయారవుతుంది, వాటిని ఏ విధంగా నియంత్రించవచ్చో కారణాలు వెల్లడించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 23, 2021, 12:58 PM IST
COVID-19 New Wave: కరోనా కొత్త వేవ్ ఏర్పడేందుకు దారితీసే 4 పరిస్థితులు ఇవే

COVID-19 new wave: కరోనా సెకండ్ వేవ్ త్వరలో ముగియనుందని, కానీ మరో ముప్పు పొంచి ఉందని ఆందోళన నెలకొంది. మరో 6 నుంచి 8 వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కానుందని ఎయిమ్స్ చీఫ్ హెచ్చరించడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా కొత్త వేవ్‌కు కారణమయ్యే కొన్ని నాలుగు విషయాలను నీతి ఆయోగ్ వెల్లడించింది.

కేంద్ర ఆరోగ్యశాఖ కోవిడ్19 (Delta Plus Variant of COVID-19)పై నిర్వహించిన మీడియా సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ న్యూ పాండామిక్ ఎలా తయారవుతుంది, వాటిని ఏ విధంగా నియంత్రించవచ్చో కారణాలు వెల్లడించారు. కొత్త వేవ్ రావడానికి 4 కారకాలున్నాయని చెప్నారు. వైరస్ ప్రవర్తన మరియు మార్పులు, ఎవరిలోనైనా చేరడం, ఇతరులకు చేరవేసే స్వభావం, అవకాశాలు.. ఇవన్నీ కలిపితే వైరస్ కొత్త వేవ్ సులువుగా తయారవుతుందని, ఆ అంశాలపైనే కరోనా వేవ్ ఆధారపడి ఉంటుందన్నారు.

Also Read: India Covid-19 Cases: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, 3 కోట్లకు బాధితులు

వైరస్ స్వభావం: ప్రతివైరస్ దానికి తగిన సామర్థ్యం, స్వభావం కలిగి ఉంటుంది. మరియు వ్యాప్తి చేసే అలవాటు, సామర్థ్యం ఉంటాయి.

మార్పులకు వీలుగా ఉండే వ్యక్తి, పదార్థం, వ్యక్తి: తాను చేరడానికి, ఆపై మార్పులు చేసుకునేందుకు అనుగుణంగా ఉండే జీవిని ఎంచుకుని ప్రవేశిస్తుంది. ఆపై కొన్ని రోజులలలో మార్పులు చేసుకుని ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటివి జరగకుడదంటే వ్యాక్సిన్ (COVID-19 Vaccine) తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, భౌతిక దూరం, బయటకు వెళ్లినప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం లాంటి కోవిడ్19 నిబంధనలు పాటించాలి.

వ్యాప్తి చెందే స్వభావం: వైరస్ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తుంది. పరివర్తన చెందిన తరువాత వేగంగా వ్యిప్తి చెందుతుంది. ఒకరిలోకి ప్రవేశించిన కరోనా వైరస్ ఆ తరువాత ముగ్గురికి వ్యాప్తి చెందుతుంది. కొన్ని సందర్భాలలో 13 మందికి వ్యాప్తి చేసే అవకాశాలున్నాయి. ఈ సందర్భాలలో మ్యూటేషన్ చెందిన వైరస్‌ను తట్టుకుని పోరాడటం చాలా కష్టమవుతుంది. కనుక లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. కరోనా బారిన పడకుండా వైద్యులు సూచించిన విధంగా రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. 

Also Read: Covaxin For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ శుభవార్త

అవకాశం: ఎలాంటి వ్యక్తులు త్వరగా బలహీనమవుతారని వారిలోకి ప్రవేశించి అధిక ప్రభావం చూపుతుంది. గుంపులుగా కూర్చుని తినడం, కూర్చుని మాట్లాడటం, భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా సులువుగా వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా మాస్కులు ధరించాలని, కోవిడ్19 నిబంధనలు పాటించాలని నీతి ఆయోగో సభ్యుడు డాక్టర్ పాల్ సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News