India Covid-19: 91 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

Last Updated : Nov 23, 2020, 09:46 AM IST
India Covid-19: 91 లక్షలు దాటిన కరోనా కేసులు

Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఆదివారం ( నవంబరు 22న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 44,059 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 511 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,39,866 కి చేరగా.. మరణాల సంఖ్య 1,33,738 కి పెరిగింది. Also read: Delhi: కోవిడ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన.. రెండు మార్కెట్ల సీజ్

అయితే నిన్న ఈ మహమ్మారి నుంచి 41,024 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనావైరస్ బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 85,62,642 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,43,486 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.68 శాతం ఉండగా.. మరణాల రేటు 1.46 శాతం ఉంది. Also read: Vedhika: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ‘రూలర్’ బ్యూటీ వేదిక

ఇదిలాఉంటే.. ఆదివారం దేశవ్యాప్తంగా 8,49,596 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 22వ తేదీ వరకు దేశంలో మొత్తం 13,25,82,730 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఎసీఎంఆర్ వెల్లడించింది. Also read: Indian Army: సరిహద్దుల్లో రహస్య సొరంగం గుర్తింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News