Covax Booster Dose: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిత్యం ఐదు వేలకు పైగా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 5,676 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 37,093కు చేరింది. కేరళ, ఢిల్లీ, ఎస్‌సీఆర్‌లలో ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. కోవిడ్ మహమ్మారి అంతకు అంత విజృంభిస్తున్న తరుణంలో సీరమ్ ఇన్సిస్టిట్యూట్ కోవోవాక్స్ వ్యాక్సిన్‌ను హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావలా వెల్లడించారు. కోవిన్ పోర్టల్‌లో Covax అందుబాటులో ఉందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ అన్ని వేరియంట్‌లకు బాగా పనిచేస్తుందని.. యూఎస్, యూరోప్ దేశలలో ఆమోదించారని చెప్పారు.
ఓమిక్రాన్ ఎక్స్‌బీబీ, దాని వేరియంట్‌లతో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని.. వృద్ధులపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని ఆయన అన్నారు. దీని తీవ్రంగా ఉంటుందని.. తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు. కోవిన్ యాప్‌లో అందుబాటులో ఉన్న Covax booster తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పునావలా ట్వీట్ చేశారు. కోవాక్స్ డోసుకు రూ.225 ఖర్చు అవుతుంది. దీనిపై జీఎస్టీ అదనం.
As COVID cases have been rising again with Omicron XBB & its variants, it can be severe for the elderly. I’d suggest for the elderly, mask up & take the Covovax booster which is now available on the COWIN app. It is excellent against all variants & is approved in the US & Europe. pic.twitter.com/H8lmIzStUa
— Adar Poonawalla (@adarpoonawalla) April 11, 2023
కోవోవాక్స్‌ను బూస్టర్‌గా అంగీకరించాలంటూ మార్చి 27న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్. దీనిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సోమవారం కోవిన్ పోర్టల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్న వ్యక్తుల కోసం కోవాక్స్ వ్యాక్సిన్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్‌ఎఫ్‌డీఏ వాటి నుంచి కూడా ఆమోదం పొందింది.
Also Read: GPF Interest Rates: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. జీపీఎఫ్ వడ్డీ రేట్లపై ప్రకటన
భారీగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక మార్గ దర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కువ కేసులు 60 ఏళ్లపైబడిన వారిలోనే వస్తున్నాయన్నారు. షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా కరోనా సోకుతోందన్నారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా 15 మంది మరణించారు.
Also Read: Karnataka Elections: రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు.. ఎన్నికల్లో మాజీ సీఎం విచిత్ర హామీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి