Corona cases in India: కరోనా కేసుల్లో స్వల్ప వృద్ధి- రికార్డు స్థాయిలో పెరిగిన మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మరోసారి వృద్ధి నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,26,064 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఒమిక్రాన్​ వేరియంట్ భయాలతో పలు రాష్ట్రాలు టెస్టుల సంఖ్యను మరింత పెంచనున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 10:25 AM IST
  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
  • రికార్డు స్థాయిలో మరణాలు నమోదు
  • కొవిడ్​ రికవరీ కేసుల్లో భారీ క్షీణత
Corona cases in India: కరోనా కేసుల్లో స్వల్ప వృద్ధి- రికార్డు స్థాయిలో పెరిగిన మరణాలు

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మరోసారి వృద్ధి నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,26,064 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఒమిక్రాన్​ వేరియంట్ భయాలతో పలు రాష్ట్రాలు టెస్టుల సంఖ్యను మరింత పెంచనున్నాయి.

ఇదిలా ఉండగా కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో.. మరోసారి రికార్డు స్థాయిలో 2,426 మరణాలు (Corona Deaths in India) నమోదయ్యాయి. బిహార్​, కేరళ రాష్ట్రాలు పెండింగ్​లో ఉన్న మరణాల సంఖ్యను క్లియర్ చేయడం వల్ల ఈ స్థాయిలో కొత్త వృద్ధి నమోదైనట్లు తెలిసింది.

ఇక గడిచిన 24 గంటల్లో 6,918 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవలి కాలంలో 7 వేల దిగువకు రికవరీలు తగ్గటం ఇదే తొలిసారి.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 99,155 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.29 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,73,326 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 34,723,515 మందికి కరోనా సోకగా.. అందులో 3,40,60,774 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) రికార్డు స్థాయిలో 1,04,18,707 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,27,61,83,065 వద్దకు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 265,707,170 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,264,128 మంది మహమ్మారికి బలయ్యారు. 239,375,161 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 21,067,881 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Cyclone Jawad: వాయుగుండంగా జవాద్ తుపాన్​- ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు!

Also read: Karnataka: ఆవులు పాలివ్వట్లేదు-పితికేందుకు వెళ్తే తంతున్నాయి-పోలీసులకు రైతు ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News