Corona Third Wave: ముంచుకొస్తున్న కరోనా థర్డ్‌వేవ్, 100 రోజులు అత్యంత కీలకం

Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ప్రపంచాన్ని భయపెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా మహమ్మారి వీడటం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైందన్న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 17, 2021, 10:47 AM IST
Corona Third Wave: ముంచుకొస్తున్న కరోనా థర్డ్‌వేవ్, 100 రోజులు అత్యంత కీలకం

Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ప్రపంచాన్ని భయపెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా మహమ్మారి వీడటం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైందన్న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి(Corona Pandemic)సంక్రమణ ఆగడం లేదు. కరోనా సెకండ్ వేవ్( Corona Second Wave)తగ్గుముఖం పట్టినా థర్డ్‌వేవ్ భయం వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్ద్‌వేవ్ ప్రారంభమైపోయిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వైరస్ సోకుతుండటంతో ఆందోళన పెరుగుతోంది. అందుకే కోవిడ్ నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మరోసారి 38 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 24 వేల 25 మంది కరోనాతో బాధపడుతున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 39.96 కోట్లమంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా చాలామందికి కరోనా వైరస్(Coronavirus)సోకుతుండటంతో ఆందోళన పెరుగుతోంది. 

ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ప్రారంభమైనట్టే..మహారాష్ట్రలోని 8 ప్రాంతాల్లో ప్రమాద సూచికలు కన్పిస్తున్నాయి. అందుకే ఇదొక హెచ్చరికగా భావించాలని ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra modi)సైతం సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండోనేషియా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో కరోనా కేసులు అధికమవుతున్నాయి.

Also read: India CoronaVirus Tests: ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు, తాజాగా తగ్గిన కోవిడ్19 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News