India Corona cases: దేశంలో కొవిడ్ కల్లోలం- ఈ నగరాల్లో అధిక తీవ్రత

Corona India cases: దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రాల వారీగా కొవిడ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 08:15 PM IST
  • దేశంలో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు
  • నగరాలపై అధికంగా కరోనా తీవ్రత
  • ముంబయి, ఢిల్లీలో 20వేలు పైనే కేసులు
India Corona cases: దేశంలో కొవిడ్ కల్లోలం- ఈ నగరాల్లో అధిక తీవ్రత

India Corona cases: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో కొవిడ్ (India Corona cases)​ కల్లోలం సృష్టిస్తోంది.

ముంబయిలో తాజాగా 20,318 కరోనా కేసులు నమోదయ్యాయి. 71,019 శాంపిళ్లను పరీక్షించగా (Corona cases in Mumbai) ఈ కేసులు బయటపడ్డాయి.

శనివారం ఒక్క రోజే ఐదు మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. 6,003 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం నగరంలో 1,06,037 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు (Corona Active cases in Mumbai) గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​ ప్రకటించింది.

ఢిల్లీలో 20 వేలపైకి కేసులు..

ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. శనివారం 20,181 కేసులు నమోదైనట్లు ఢిల్లీ  (Corona cases in Delhi) ఆరోగ్య విభాగం ప్రకటించింది. 11,869 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో 48,178 యాక్టివ్​ కొవిడ్ కేసులు ఉన్నాయి. రోజవారీ పాజిటివిటీ రేటు 19.6 శాతానికి (Corona Active cases in Delhi) పెరిగింది.

బెంగళూరులో  కేసులు ఇలా..

బెంగళూరులో కూడా కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా 7,113 మందికి పాజిటివ్​గా (Corona cases in Bengaluru) తేలింది. దీనితో నగరంలో పాజిటివిటీ రేటు 10 శాతంగా ఉన్నట్లు కర్ణాటక ఆరోగ్య విభాగం వివరించింది.

రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే కొవిడ్ కేసుల్లో 79 శాతం ఇక్కడే ఉంటున్నట్లు వివరించింది.

వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు..

పశ్చిమ్​ బెంగాల్​లో కొవిడ్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. 18,802 కరోనా కేసులు (Corona cases in West Bengal) బయటపడ్డాయి. 19 మంది కొవిడ్​కు బలయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 62,055 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 29.6 శాతంగా ఉంది.

కేరళలో కొత్తగా 5,944 కొవిడ్ కేసులు (Corona cases in Kerala) నమోదయ్యాయి. 33 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 31,098 యాక్టివ్ కరోనా​ కేసులు ఉన్నాయి.

Also read: Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్

Also read: Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News