Central government: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందిస్తోంది. సొంత ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ట్యాక్స్‌లో మినహాయింపు ఇచ్చే గడువు పెంచింది ప్రభుత్వం. అటు ఆస్థి అమ్మకంపై కూడా మినహాయింపు ఇస్తోంది. ఎలాగంటే..
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి (Corona Pandemic) కారణంగా చాలామంది ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్‌కంటాక్స్ చెల్లించేవారికి సైతం ఇబ్బందులు తప్పలేదు. ఇళ్లు కొనాలనుకునేవారు, ఆస్థి అమ్మి కొత్త ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇన్‌కంటాక్స్ (Income tax) సమస్య వెంటాడేది. అందుకే కేంద్ర ప్రభుత్వం (Central government)ఈ విషయాల్లో గుడ్‌న్యూస్ అందించింది. కొత్త ఇంటి కొనుగోలు కోసం పెట్టే పెట్టుబడిలో పన్ను మినహాయింపును క్లైయిమ్ చేసుకునే గడువును మరోసారి పెంచింది. జూన్ 30 వరకూ ఉన్న గడువును ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకూ పెంచింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయింది.
మరోవైపు ఆదాయపు పన్ను(Income tax) చట్టంలోని సెక్షన్ 54, 54జిబి ప్రకారం మీరు మీ ఆస్థిని విక్రయిస్తే..కేపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఆస్థి అమ్మకం ద్వారా వచ్చే డబ్బును మూడేళ్లలోగా కొత్త నిర్మాణం లేదా రెండేళ్లలోపు కొత్త ఇంటి కొనుగోలు కోసం వాడాల్సి ఉంటుంది. అప్పుడే మీ పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. పెట్టుబడి 2 కోట్ల కంటే తక్కువ ఉంటే కచ్చితంగా పన్ను మినహాయింపు లభిస్తుంది.
Also read: Coviself Test Kit: ఆన్లైన్లో టెస్ట్ కిట్లు..ఇక ఇంట్లోనే కరోనా పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook