Heatwave Alert: ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగభగ మండుతూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ కేంద్రం ఎండ వేడి ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. వివిధ రంగాలలోని కార్మికులకు పని చేసే గంటలను రీషెడ్యూల్ చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసిన కేంద్రం.. ఎండ వేడి వల్ల కలిగే ప్రతికూల పరిస్థితులను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకునేందుకు నిర్మాణ సంస్థలు, పరిశ్రమలకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు విజ్ఞప్తిచేసింది.
కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
అధిక ఉష్టోగ్రతల వల్ల కలిగే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. కార్మికులు, సిబ్బందిపై ఎండవేడి ప్రభావం పడకుండా పని గంటలను రీషెడ్యూల్ చేయడం, పని చేసే చోట తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం పేర్కొంది.
రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు
ఒడిశా, బీహార్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాలతో పాటు కోస్తాంధ్ర, యానాం రాష్ట్రాలు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. కార్మికులు పనిచేసే చోట విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయాలు, చల్లటి తాగు నీరు, అలసట లేకుండా ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్ అందించాలని సూచించింది. కార్మికులపై పని ఒత్తిడి లేకుండా వారు నెమ్మదిగా పని చేసుకునేందుకు గనులు, నిర్మాణ రంగ సంస్థలు, పరిశ్రమల యజమానులను అనుమతించాలని సూచించింది.
ఇది కూడా చదవండి : Linking PAN With Aadhaar: పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే జరిగే నష్టం ఏంటి
భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులపై స్పెషల్ ఫోకస్
భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులు, ఇటుక బట్టీల్లో పని చేసే కార్మికులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేంద్రం స్పష్టంచేసింది. మరీ ముఖ్యంగా రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్టోగ్రతలు నమోదు కానున్నాయి. అలాగే, రాబోయే 2 రోజుల్లో వాయువ్య భారత్‌లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Monkey Rescues Kitten: మంచితనం తెలిసిన కోతి పిల్ల.. నీ జాలి గుండెకు హ్యాట్సాఫ్.. వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK