Corona vaccination: సీరమ్, భారత్ బయోటెక్ కంపెనీలతో కేంద్రం ఒప్పందం

Corona vaccination: భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకోనుంది.

Last Updated : Jan 4, 2021, 10:40 PM IST
  • కరోనా వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు
  • త్వరలో భారత్ బయోటెక్, సీరమ్ కంపెనీలతో ఒప్పందం
  • డోసుకు 2 వందల చొప్పున 6.6 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కుదుర్చుకోనున్న డీల్
Corona vaccination: సీరమ్, భారత్ బయోటెక్ కంపెనీలతో కేంద్రం ఒప్పందం

Corona vaccination: భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకోనుంది.

కరోనా వైరస్‌ ( corona virus ) ను అరికట్టేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్‌కు, ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford-AstraZeneca ) వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగపు అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కోవ్యాగ్జిన్ తయారు చేస్తోంది. అటు ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేయనుంది. 

దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ), హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ( Bharat Biotech company )లతో త్వరలో ఒప్పందం చేసుకోనున్నట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. వ్యాక్సిన్ ఒక్కో డోసును ప్రభుత్వానికైతే 2 వందల రూపాయల చొప్పున, ప్రైవేటుకైతే వేయి రూపాయల చొప్పున విక్రయించేందుకు డీల్ కుదరనుంది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ ( Covaxin ) సమర్ధవంతమైందని ఇప్పటికే ఐసీఎంఆర్ ( ICMR ) వెల్లడించింది. 

ఇందులో భాగంగా 3 కోట్ల మంది ప్రంట్‌లైన్, హెల్త్‌కేర్  వర్కర్ల కోసం 6.6 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

Also read: Farmers protest: మరోసారి చర్చలు విఫలం..సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో రైతు సంఘాలు

Trending News