Womens Superhit Scheme: కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పధకాన్ని ఎల్ఐసీ ద్వారా అందిస్తోంది. ఎల్ఐసీ బీమా సఖి స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ లాంచ్ ఇటీవల అంటే డిసెంబర్ 9వ తేదీన లాంచ్ చేశారు. మహిళల స్వావలంబనకు ఈ పధకం అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఈ పధకాన్ని మంచి రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఈ పధకంలో చేరేందుకు ఎవరు అర్హులనే వివరాలు తెలుసుకుందాం.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా నెల రోజుల క్రితం మహిళల కోసం ఎల్ఐసీ బీమా సఖి స్కీమ్ ప్రారంభించింది. 18-70 ఏళ్ల వయస్సు కలిగిన పదో తరగతి చదివిన మహిళల్ని ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు, స్వావలంబనకై రూపుదిద్దిన పధకం ఇది. ప్రారంభించిన కేవలం నెలరోజుల్లోనే 50 వేల మంది మహిళలు చేరడంతో ఈ స్కీమ్ సూపర్‌హిట్ అయింది. ఈ పధకంలో భాగంగా పదో తరగతి చదివిన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమిస్తారు. శిక్షణ పొందిన బీమా సఖి మహిళలకు మూడేళ్ల వరకు ఎల్ఐసీ కనీస వేతనం లేదా స్టైపెండ్ ఇస్తుంది. శిక్షణ పూర్తయ్యాక ఎల్ఐసీ ఏజెంట్లుగా సొంతంగా పనిచేయవచ్చు. అదే క్రమంలో డిగ్రీ అర్హత సాధించుకుంటే ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయ్యేందుకు అవకాశముంటుంది.
ఎల్ఐసీ బీమా సఖి స్కీమ్ లాంచ్ చేసిన నెలరోజుల్లో 52,511 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 27,695 మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ అయ్యాయి. అంటే వీళ్లంతా ఎల్ఐసీ ఏజెంట్లుగా అధికారికంగా కొనసాగవచ్చు. ఇక 14,583 మంది అప్పుడే పాలసీలు విక్రయించడం ప్రారంభించేశారు. ప్రతి పంచాయితీలో కనీస ఒక బీమా సఖిని నియమించాలనేది ఎల్ఐసీ ఉద్దేశ్యంగా ఉంది. బీమా సఖి ద్వారా ఎల్ఐసీ వ్యాపారం పెంచుకోవడంతో పాటు మహిళల్ని ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేయవచ్చు. అందుకే రానున్న మూడేళ్లలో ఎల్ఐసీ 2 లక్షలమంది బీమా సఖిలను నియమించుకోనుంది. 18-70 ఏళ్ల మహిళలు దీనికి అర్హులు.
ఇక ఎల్ఐసీ బీమా సఖిలో నియామకమైన మహిళలకు మొదటి ఏడాది నెలకు 7 వేల రూపాయలు స్టైపెండ్ లభిస్తుంది. రెండవ ఏడాది మాత్రం నెలకు 6 వేల రూపాయలు చెల్లిస్తారు. మూడో ఏడాది నెలకు 5 వేలు ఇస్తారు. ఇక ఎల్ఐసీ పాలసీల విక్రయంపై వచ్చే కమీషన్ ఇందుకు అదనం. ఇప్పటికే ఎల్ఐసీ ఏజెంట్లు లేదా ఉద్యోగులుగా ఉన్నవారి బంధువులు అనర్హులు. బందువులంటే పిల్లలు, భార్య లేదా భర్త, సవతి పిల్లలు, తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు ఉంటారు. ఎల్ఐసీ బీమా సఖికు అప్లై చేసేందుకు సంబంధిత అప్లికేషన్‌తో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన వయసు ధృవీకరణ పత్రం, సెల్ఫ్ అటెస్టెడ్ అడ్రస్ ప్రూఫ్, సెల్ఫ్ అటెస్టెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అవసరమౌతాయి.
Also read: H-1B Visa Rules: హెచ్1బి వీసాలో 5 కీలక మార్పులు, ఇవి తెలుసుకోకుంటే మీ వీసా ఆగిపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.