Covid19 Restrictions: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా సంక్రమణను అడ్డుకునేందుకు ఆంక్షలు విధించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
కరోనా సంక్రమణ మరోసారి పెరుగుతుండటం దేశంలో ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలలో పెద్దఎత్తున కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ముప్పు సైతం వెంటాడుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ 19 సంక్రమణను అడ్డుకునేందుకు ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. రానున్న పండుగల సందర్బంగా ఈ ఆంక్షలు విధించాలని తెలిపింది. ఆగస్టు 19న మొహర్రం, ఆగస్టు 21న ఓనం, ఆగస్టు 30న జన్మాష్ఠమి, సెప్టెంబర్ 10న వినాయక చవితి, అక్టోబర్ 5-15 మధ్యలో దసరా నవరాత్రుల సందర్భంగా జనం ఒకే చోట గుమిగూడకుండా ఆంక్షలు(Covid19 Restrictions) విధించాలని స్పష్టం చేసింది. పండుగల సందర్భంగా జనం పెద్దసంఖ్యలో ఒకేచోట చేరితే సూపర్ స్పైడర్‌గా మారే అవకాశముంటుందని కరోనా వైరస్ కైసులు పెరగవచ్చని ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ ఆందోళన వ్యక్తం చేశాయి.
Also read: ఆ కళాశాలలు ఫీజులు వెనక్కి ఇవ్వకపోతే గుర్తింపు రద్దుతో పాటు కఠిన చర్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook