CBSE Results 2022: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలపై లేటెస్ట్ అప్‌డేట్ వెలువడింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. ఎప్పుడు వెలువడేది స్పష్టత వచ్చింది.
సీబీఎస్ఈ బోర్డు నిర్వహించిన 10, 12 తరగతి పరీక్షల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డు ఫలితాల్ని హఠాత్తుగా విడుదల చేయనుందని తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుండానే ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. సీబీఎస్ఈ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. సీబీఎస్ఈ 10,12 వ తరగతి ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లు cbse.gov.in మరియు cbseresults.nic.in ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఈ రెండింటితో పాటు ధర్డ్‌పార్టీ వెబ్‌సైట్స్ లేదా మొబైల్ యాప్స్‌లో కూడా విడుదల కావచ్చు.
2022 జూన్ 20 నాటికి పేపర్ వాల్యుయేషన్ పూర్తయింది. విద్యార్ధుల నెంబర్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియ జరుగుతోంది. వెబ్‌సైట్‌పై ఇప్పటివరకూ ఎంతమంది విద్యార్ధుల ఫలితాలు అప్‌లోడ్ అయ్యోయో ఇంకా తెలియలేదు. రిజల్ట్ అప్‌లోడ్ ప్రక్రియ పూర్తవగానే ఫలితాలు విడుదల కావచ్చు.
సీబీఎస్ఈ 10, 12 పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేయాలి
సీబీఎస్ఈ బోర్డ్ 10, 12 ఫలితాల్ని చెక్ చేసేందుకు విద్యార్ధులు ముందుగా సీబీఎస్ఈ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in ఓపెన్ చేసి..హోమ్‌పైజ్‌పై 10,12 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రోల్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు సబ్మిట్ చేయాగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై వస్తాయి.
Also read: Covid Cases: తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు! దేశంలో 92 వేలు దాటిన కొవిడ్ యాక్టివ్ కేసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.