CBSE Result 2023: సీబీఎస్​ఈ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CBSE Result Check on cbseresults nic in: దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీబీఎస్​ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. https://cbseresults.nic.in/, https://results.cbse.nic.in/ మీ ఫలితాలను చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : May 12, 2023, 11:45 AM IST
CBSE Result 2023: సీబీఎస్​ఈ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CBSE Result Check on cbseresults nic in: సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్జ్యుకేషన్ (సీబీఎస్​ఈ ) క్లాస్​ 12 ఫలితాలను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ​ఈ ఏడాది 87.33శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది సీబీఎస్‌సీ 12వ తరగతి పరీక్షలకు మొత్తం 16.60 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కోవిడ్ మహమ్మారి జోరుగా ఉన్న సమయంలో 2019లో 83.40% ఉత్తీర్ణత శాతం కంటే ఈ సారి 87.33% ఎక్కువ ఉత్తీర్ణత నమోదైంది.

అయితే గతేడాది 92.71% కంటే తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ ఫలితాలను https://cbseresults.nic.in/, https://results.cbse.nic.in/ వెబ్‌సైట్లలో చెక్​ చేసుకోవచ్చు. డిజీలాకర్​, ఉమంగ్​ యాప్‌​ల ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఫలితాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

==> స్టెప్​ 1: https://cbseresults.nic.in/ వెబ్‌సైట్ లేదా క్లిక్ చేయండి.

==> స్టెప్​ 2: స్టూడెంట్ రోల్​ నెంబర్​, అడ్మిట్​ కార్డు ఐడీ, స్కూల్​ నెంబర్​ వంటి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

==> స్టెప్​ 3: ఈ వివరాలు ఎంటర్ చేసిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. స్క్రీన్‌పై మీ రిజల్ట్స్​ కనిపిస్తాయి.

==> స్టెప్​ 4: ఫలితాలను డౌన్‌లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.

పోటీతత్వం పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెట్టుకుండా సీబీఎస్‌ఈ ఈ సారి కీలక చర్యలు తీసుకుంది. ఫస్డ్​, సెకెండ్​, థర్డ్​ డివిజన్​లు ఇవ్వడం లేదని వెల్లడించింది. టాపర్స్‌​కు మెరిట్​ సర్టిఫికెట్లను అందజేస్తున్నట్లు తెలిపింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో అత్యధికంగా 99.91శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వగా.. ఉత్తర్​ ప్రదేశ్​లోని ప్రయాగ్​ రాజ్​ అత్యల్పంగా 78.05శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని అధికారులు వెల్లడించారు.

Also Read: Indian Railway Facts: ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయా..? ఈ విషయాలు తెలుసుకోండి 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News