CBSE 2022 Term 2 Dates: సీబీఎస్ఈ 10, 12 తరగతుల రెండో టర్మ్ పరీక్షల షెడ్యూల్

CBSE Term 2 Board Exams 2022: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల సెకెండ్ టర్మ్ ఎగ్జామ్స్‌ ఈ సారి ఆఫ్‌లైన్ మోడ్‌లో జరగనున్నాయి. ఏప్రిల్ 26వ తేదీ నుంచే ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పరీక్షల ఫుల్‌ షెడ్యూల్‌ తర్వలోనే రానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 01:48 AM IST
  • త్వరలో సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల రెండో టర్మ్‌ ఎగ్జామ్స్‌
  • ఏప్రిల్‌ 26 నుంచి థియరీ ఎగ్జామ్స్‌
  • ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనే ఈ ఎగ్జామ్స్‌
  • త్వరలో ఫస్ట్ టర్మ్‌ ఎగ్జామ్స్‌ రిజల్ట్స్‌
CBSE 2022 Term 2 Dates: సీబీఎస్ఈ 10, 12 తరగతుల రెండో టర్మ్ పరీక్షల షెడ్యూల్

CBSE Term 2 Exam Dates: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల స్టూడెంట్స్‌కు రెండో టర్మ్‌ ఎగ్జామ్స్‌ ఏప్రిల్‌ 26 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఎగ్జామ్స్‌ను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో నిర్వహించనున్నట్లుగా సీబీఎస్‌ఈ తెలిపింది. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులను సమీక్షించి తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. థియరీ ఎగ్జామ్స్‌ ఏప్రిల్‌ 26 నుంచి మొదలుకానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే రిలీజ్ కానుంది. 

సీబీఎస్‌ఈ బోర్డ్‌ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి శాంపిల్‌ క్వశ్చన్‌ పేపర్స్‌ మాదిరిగానే.. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ప్యాట్రన్‌ ఉండనుంది. కరోనా నేపథ్యంలో 2021-22 అకాడమిక్ ఇయర్‌‌కు సంబంధించి 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్‌ సీబీఎస్‌ఈ టర్మ్‌ పరీక్షల నిర్ణయం తీసుకుంది. అకాడమిక్‌ సెషెన్‌ను రెండు పార్ట్‌లుగా విభజించి ఎగ్జామ్స్‌ కాండాక్ట్‌ చేస్తోంది. 

ఫస్ట్ టర్మ్‌ ఎగ్జామ్స్‌ గతేడాది నవంబర్‌‌, డిసెంబరులలో పూర్తికాగా, సెకెండ్ టర్మ్‌ ఎగ్జామ్స్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి మొదలుకానున్నాయి.సీబీఎస్‌ఈ సెకెండ్ టర్మ్‌ ఎగ్జామ్స్‌పై సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులకు బోర్డ్ సూచించింది.

సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఉండే సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని బోర్డ్‌ పేర్కొంది. ఇక టర్మ్ 1 ఫలితాల గురించి సీబీఎస్‌ఈ బోర్డ్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఫలితాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.కాగా సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు ప్రాక్టికల్ పరీక్షలు మార్చి మొదటి వారంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Also Read: Hijab controversy: హిజాబ్ వివాదం భయాలు- మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్​!

Also Read: JNU News VC: మరోసారి తెలుగు వ్యక్తికి అవకాశం... జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News