వాహనాలను గుర్తుపట్టేందుకు కలర్ కోడ్ స్టిక్కర్లు

పెట్రోల్‌కు బ్లూ, డీజిల్‌కు ఆరెంజ్.. 

Last Updated : Aug 14, 2018, 08:48 AM IST
వాహనాలను గుర్తుపట్టేందుకు కలర్ కోడ్ స్టిక్కర్లు

వాహనాల్లో వినియోగించే ఇంధన రకాన్ని బట్టి వాటికి హాలోగ్రామ్ ఆధారిత వేర్వేరు రంగు స్టిక్కర్లను అతికించాలని కేంద్రం చేసిన సూచనలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. పెట్రోల్, సీఎన్జీ గ్యాస్‌లతో నడిచే వాహనాలకు లేతనీలం రంగు, డీజిల్‌తో నడిచే వాటికి నారింజ రంగు స్టిక్కర్లను అతికించాలని సూచించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎంబీ లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్ర రోడ్డు రవాణా శాఖ తరఫున ఏఎస్జీ నాడ్‌కర్ణీ ఈ ప్రతిపాదన చేశారు.

సెప్టెంబర్ 30నాటికి ఢిల్లీలో ఇంధనం ఆధారంగా వాహనాలను గుర్తుపట్టేందుకు కలర్ కోడ్ స్టిక్కర్లు అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య సమస్యపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాలుష్యం పెరుగుతున్న సందర్భంగా వాహనాల వాడకాన్ని నియంత్రించడానికి సరి-బేసి విధానం కంటే కలర్ కోడ్ సిస్టం ఉపయోగపడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వాహనాలకు గ్రీన్‌నెంబరు ప్లేట్లను వినియోగించాలాని కోర్టు ఏఎస్జీకి సూచించగా.. కేబినెట్‌ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Trending News