బీజేపీకి ఎవ్వరి మద్ధతు అవసరం లేదు : అమిత్ షా

బీఎస్ యెడ్యూరప్పతో కలిసి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 

Last Updated : May 10, 2018, 05:48 PM IST
బీజేపీకి ఎవ్వరి మద్ధతు అవసరం లేదు : అమిత్ షా

ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఇవాళే ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో రాజకీయ పార్టీల ప్రచారంలో మరింత జోరు కనిపించింది. ఈ సందర్భంగా బీజేపీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన బీఎస్ యెడ్యూరప్పతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ.. ఈసారి తమ పార్టీ 130కిపైగా స్థానాల్లో గెలిచి సునాయసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. '' ఈ ఎన్నికల్లో బీజేపీ ఎవరికి మద్ధతు ఇవ్వాల్సిన అవసరం రాదు. అలాగే బీజేపీ ఎవరి మద్ధతు తీసుకోదు. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా బీజేపీ సొంతం'' అని అమిత్ షా స్పష్టంచేశారు. అంతేకాకుండా కర్ణాటకలో ఇక మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యపడదు అని ఆయన తేల్చిచెప్పారు. 

'' కర్ణాటకలో ప్రతీ జిల్లాకు వెళ్లాను. ఎక్కడికెళ్లినా అక్కడ బీజేపీ సునామినే కనిపిస్తోంది. ఆ సునామినే చూస్తే, కర్ణాటకలో ఇక కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని అర్థమైపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీఎస్ యెడ్యూరప్ప నాయకత్వంలో కర్ణాటక త్వరలోనే అభివృద్ధిపథంలో పయణించడం ఖాయం. త్వరలోనే కర్ణాటక భవిష్యత్తు మారబోతుంది'' అని అమిత్ షా అభిప్రాయపడ్డారు. 

Trending News