లక్నో: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికలు చివరి విడత పోలింగ్ ప్రచారం ముగిసిన అనంతరం కూడా ట్విటర్ ద్వారా పలు ట్వీట్స్ చేసి ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన మాయావతిపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ యూపీ సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదులో బీజేపి పేర్కొంది.
అంతకన్నా ముందుగా ప్రధాని నరేంద్ర మోదీపై పలు విమర్శలు చేసిన మాయావతి.. ప్రధాని మోదీ వారణాసి స్థానం నుంచి గెలిస్తే అయ్యే చారిత్రాత్మకం కన్నా ఓడితేనే మరింత చరిత్రాత్మాకం అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ హయాంలో ఈశాన్య ఉత్తర్ ప్రదేశ్ ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శిస్తూ మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.