Madhya Pradesh bypolls: హస్తం గుర్తుకు ఓటేయ్యమన్న బీజేపీ నేత సింధియా

మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల (Madhya Pradesh bypolls) హాడావిడి వాడీవేడిగా కొనసాగుతోంది. 3న జరగనున్న ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. అయితే 28 స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress)  ప్రచారం నిర్వహించాయి.

Last Updated : Nov 1, 2020, 05:53 PM IST
Madhya Pradesh bypolls: హస్తం గుర్తుకు ఓటేయ్యమన్న బీజేపీ నేత సింధియా

Madhya Pradesh bypolls భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల (Madhya Pradesh bypolls) హాడావిడి వాడీవేడిగా కొనసాగుతోంది. 3న జరగనున్న ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. అయితే 28 స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress)  ప్రచారం నిర్వహించాయి. ఈ క్రమంలో ఎప్పుడూ చలాకీగా ఉంటూ.. తనదైన స్టైల్లో మాట్లాడే బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా (Jyotiraditya Scindia) పొరపాటున హస్తం గుర్తుకు (panja) ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు ఎంపీ కాంగ్రెస్ (MP Congress) ట్విట్ చేసి.. సింధియాజీ 3వ తేదీన ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్‌కే ఓటు వేస్తారంటూ.. వీడియోను పంచుకుంది.

బీజేపీ అభ్యర్థి ఇమార్తి దేవి (Imarti Devi) కి మద్దతుగా.. శనివారం దాబ్రాలో ఆ పార్టీ నేత జ్యోతిరాధిత్య సింధియా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సింధియా మాట్లాడుతూ.. 3 తేదీన హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ పొరపాటున అభ్యర్థిస్తూ.. కాంగ్రెస్‌ పేరును ప్రస్తావించబోయి ఆగిపోయారు. రెప్పపాటులోనే తన పొరపాటును గ్రహించిన ఆయన మళ్లీ పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఒకేసారి సింధియా ఈ విధంగా పేర్కొనడంతో.. ఆ పార్టీ అభ్యర్థితోపాటు ప్రజలు కూడా అవాక్కయి.. చిరునవ్వులు చిందించారు. Also read: MP Bypolls: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే

ఇదిలా ఉంటే.. కమల్‌నాథ్‌తో వైరం ముదరడంతో.. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనతోపాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ సీట్లతోపాటు.. మరో ఆరు స్థానాలకు కలిపి రాష్ట్రంలో మొత్తం 28 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News