West Bengal Elections 2021: బెంగాల్ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. అధికార టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా నేనా రీతిలో పోటీ సాగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీను ఇరుకున పెట్టేందుకు బీజేపీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది.
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా అందరి దృష్టి పడింది మాత్రం పశ్చిమ బెంగాల్ ఎన్నికల(West Bengal Assembly Elections)పైనే. బెంగాల్ పీఠంపై ముచ్చటగా మూడోసారి కూర్చోడానికి దీదీ మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంటే.బెంగాల్ పీఠంపై కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దసంఖ్యలో కీలకనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. టీఎంసీ(TMC)లో కీలకంగా ఉన్న సీనియర్ నేత సువేందు అధికారి సైతం బీజేపీలో చేరిపోయారు. బీజేపీ ఇప్పుడు 57 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)ని ఇరుకునపెట్టేందుకు కొత్త అస్త్రాన్ని సంధించింది.
మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్‌లో ఆమెకు పోటీగా ...నిన్న మొన్నటివరకూ ఆమెకు సన్నిహితుడిగా ఉన్న పార్టీలో సీనియర్ నేత, ఇటీవల బీజేపీ(BJP) తీర్ధం పుచ్చుకున్న నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. 2011లో ఉవ్వెత్తున ఎగసిన నిరసనలతో మమతా బెనర్జీ అధికారంలో వచ్చేందుకు కారణమైన నందిగ్రామ్ (Nandigram) ఈసారి ఎన్నికల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఇప్పుడిక్కడ పోటీ మమతా వర్సెస్ సువేందు అధికారి కావడమే. సువేందు అధికారి(Suvendu Adhikari)కి స్థానికంగా పట్టుండటంతో పోటీ కీలకంగా మారింది. మరోవైపు మాజీ క్రికెటర్ అశోక్ దిందా, మాజీ ఐపీఎస్ అధికారి భారతి ఘోష్‌లకు తొలి జాబితాలో స్థానం కల్పించింది బీజేపీ. ఒక స్థానాన్ని మాత్రం మిత్రపక్షం ఏజేఎస్‌యూకి కేటాయించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మార్చ్ 27 నుంచి 29 వరకూ 8 దశల్లో జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో మొదటి రెండు విడతలు ఎన్నికలు జరిగే 60 స్థానాలున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook