Student Story: 24 గంటల్లో 700 కి.మీ ప్రయాణించాడు...10 నిమిషాలు లేట్ అవడంతో ఎగ్జామ్ మిస్ అయ్యాడు.

బీహార్ కు చెందిన ఒక విద్యార్థి కొన్ని నెలల నుంచి NEET పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే 10 నిమిషాలతో ఎగ్జామ్ మిస్ అయ్యాడు. ఈ విద్యార్థి పేరు సంతోష్ కుమార్ యాదవ్.

Last Updated : Sep 14, 2020, 09:30 PM IST
    • బీహార్ కు చెందిన ఒక విద్యార్థి కొన్ని నెలల నుంచి NEET పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు.
    • అయితే 10 నిమిషాలతో ఎగ్జామ్ మిస్ అయ్యాడు. ఈ విద్యార్థి పేరు సంతోష్ కుమార్ యాదవ్.
    • NEET 2020 పరీక్ష కోసం బీహార్ నుంచి దర్భంగా నుంచి కోల్ కత్తా కు చేరడానికి 24 గంటల్లో 700 కి.మీ. ప్రయాణించాడు.
Student Story: 24 గంటల్లో 700 కి.మీ ప్రయాణించాడు...10 నిమిషాలు లేట్ అవడంతో ఎగ్జామ్ మిస్ అయ్యాడు.

బీహార్ కు ( Bihar ) చెందిన ఒక విద్యార్థి కొన్ని నెలల నుంచి NEET పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే 10 నిమిషాలతో ఎగ్జామ్ మిస్ అయ్యాడు. ఈ విద్యార్థి పేరు సంతోష్ కుమార్ యాదవ్. NEET 2020 పరీక్ష కోసం బీహార్ నుంచి దర్భంగా నుంచి కోల్ కత్తా కు చేరడానికి 24 గంటల్లో 700 కి.మీ. ప్రయాణించాడు. 

తన 24 గంటల ప్రయాణంలో అతను రెండు బస్సులు మార్చాడు, ఒక క్యాబ్ కూడా తీసుకున్నాడు. అయితే కేవలం 10 నిమిషాలు ఆలస్యం అవడంతో అతడిని ఎగ్జామ్ సెంటర్ లోకి అతడిని వెళ్లనివ్వలేదు.

అక్కడి అధికారులను ఎంతగా ప్రాధేయ పడినా.. తన ప్రయాణం గురించి తెలిపినా వారు మాత్రం ఏ మాత్రం అంగీకరించలేదు. ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండంతో విద్యార్థులు అంతా మధ్యాహ్నం 1.30 నిమిషాలకు హాల్ లోకి వెళ్లాలనే నిబంధన ఉంది. అయితే సంతోష్ మాత్రం 1.40 నిమిషాలకు చేరుకున్నాడు.

తన ప్రయాణంలో అతను ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిపిన సంతోష్ .. శనివారం ఉదయం 8 గంటలకు బీహార్ నుంచి బస్సులో ప్రయాణం మొదలుపెట్టాను అని తెలిపాడు. ముజఫ్ఫర్ నగర్ , పాట్నా మధ్యలో 6 గంటలు ఆలస్యం అయింది. పాట్నా నుంచి రాత్రి 9 గంటలుకు బయల్దేరగా.. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అతను కోల్ కత్తా చేరుకున్నాడు. అక్కడి నుంచి క్యాబ్ తీసుకును ఎగ్జామినేషన్ సెంటర్ కు 40 నిమిషాల సమయం పట్టింది. అతను ఒంటిగంటా 40 నిమిషాలకు అక్కడికి చేరుకున్నాడు.

 ఏడాది అంతా చేసిన కష్టం మొత్తం నాశనం అయింది అని గుండెలు బాదుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లిన సంతోష్ వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే ప్రిపేరేషన్ ప్రారంభించాడట.

 

తెలుగు రాష్ట్రాల తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్  వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

 

Trending News