బిగ్ బాస్ రియాల్టీ షోపై నిషేధం విధించాలని కేంద్రానికి లేఖ

బిగ్ బాస్ రియాల్టీ షోపై నిషేధం విధించాలని కేంద్రానికి లేఖ

Last Updated : Oct 10, 2019, 01:05 PM IST
బిగ్ బాస్ రియాల్టీ షోపై నిషేధం విధించాలని కేంద్రానికి లేఖ

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తోన్న బిగ్‌బాస్ హిందీ రియాల్టీ షోపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన బీజేపి ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ లేఖ రాశారు. హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ రియాల్టీ షో వల్ల సమాజంలో అసభ్యత వ్యాపిస్తోందని, నైతిక విలువలు దెబ్బతింటున్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓవైపు దేశంలో అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను తిరిగి కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అహర్నిషలు కృషిచేస్తోంటే.. మరోవైపు బిగ్ బాస్ తరహా రియాల్టీ షోలు భారతీయ విలువలు నశింపచేస్తున్నాయని నందకిషోర్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే తక్షణమే బిగ్ బాస్ రియాల్టీ షోపై నిషేధం విధించాలని నంద కిషోర్ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఆయన లేఖ రాశారు. బిగ్‌బాస్ హిందీ షో ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తోంది. 

టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే కథనాలపై సెన్సార్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా నంద కిషోర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

Trending News