Bhola Fish: చేప చిక్కి.. బామ్మకి అదృష్టం తలుపుతట్టింది

పేదరికంలో మగ్గుతున్న ఓ వృద్ధురాలికి (Elderly woman) చేప రూపంలో అదృష్టం తలుపుతట్టింది. దీంతో ఆమె రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యింది. చేప రూపంలో కష్టాలు తీరడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Last Updated : Oct 2, 2020, 08:35 AM IST
Bhola Fish: చేప చిక్కి.. బామ్మకి అదృష్టం తలుపుతట్టింది

Elderly woman becomes rich overnight: కోల్‌కతా: పేదరికంలో మగ్గుతున్న ఓ వృద్ధురాలికి (Elderly woman) చేప రూపంలో అదృష్టం తలుపుతట్టింది. దీంతో ఆమె రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యింది. చేప రూపంలో కష్టాలు తీరడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పశ్చిమ బెంగాల్‌‌ (West Bengal) సాగర్‌ ద్వీపం చక్పుల్ధుబి గ్రామంలో పుష్పాకర్‌ అనే వృద్ధురాలికి నదిలోయ 52కిలోల అతిపెద్ద చేప పట్టుబడింది. దీంతో ఆ చేపను పుష్పాకర్ రూ. 3 లక్షలకు విక్రయించింది. స్ధానిక మార్కెట్‌లో ఆ చేప కిలోకు 6,200 రూపాయలు చొప్పున ధర పలకడంతో వృద్ధురాలు కష్టం ఫలించినట్లయింది. అయితే ఈ చేపను హోల్‌సేల్‌ మార్కెట్‌లో​ రూ. 3 లక్షలకుపైగా విక్రయించానని.. ఇది తనకు జాక్‌పాట్ లాగా మారిందని పుష్పకర్ ఆనందం వ్యక్తంచేసింది. ఇంత పెద్ద చేపను తాను ఎప్పుడూ చూడలేదని, బెంగాలీలో ఈ చేపను భోలా ఫిష్‌ (Bhola Fish) అంటారని ఆమె పేర్కొంది. Also read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ఇదిలాఉంటే.. నది నుంచి ఈ భారీ చేపను గ్రామంలోనికి తీసుకురావడానికి వృద్ధురాలు పుష్పాకర్ చాలా కష్టపడిందని చక్పుల్ధుబి గ్రామస్థులు తెలిపారు. అయితే ఆ భారీ చేపను చుట్టుపక్కలున్న ప్రజల సాయంతో ఫిష్‌ మార్కెట్‌కు తీసుకొచ్చిందని వెల్లడించారు. అయితే ఓడ ఢీ కొనడంతోనే ఈ చేప చనిపోయి ఉంటుందని గ్రామస్తులు ఓ గ్రామస్థుడు తెలిపారు. అయితే ఈ చేపను విదేశాలకు తరలిస్తారని గ్రామస్థులు తెలిపారు. చేప చనిపోకుండా ఉండినట్లయితే.. ఎక్కువ ధర పలికేదని ఇది ఎక్కువగా ఆగ్నేయాసియాలోని (Southeast Asia)  దేశాలకు ఎగుమతి అవుతుందని వ్యాపారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ బామ్మ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అదృష్టం అంటే బామ్మదే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News