BEL Jobs 2020: బీఈఎల్ జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోని వారికి మరో ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL Jobs 2020) పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చింది.

Last Updated : Dec 1, 2020, 11:32 AM IST
BEL Jobs 2020: బీఈఎల్ జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోని వారికి మరో ఛాన్స్

అసలే కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయాలలో ఉద్యోగావకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL Jobs 2020) పలు పోస్టుల భర్తీకి సిద్ధమైంది. పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చింది.

తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బీఈఎల్ ఉద్యోగాలు 2020 (BEL Recruitment 2020)కు దరఖాస్తు గడువు నవంబర్ 23న ముగిసింది. అయితే తాజాగా దరఖాస్తు గడువును డిసెంబర్ 2, 2020 వరకు పొడిగించి దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం ఇచ్చింది. పంచకులలోని యూనిట్‌లో 125 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని బీఈఎల్ స్వీకరించింది. తాజాగా గడువు పొడిగించింది.  అధికారిక వెబ్‌సైట్: https://www.bel-india.in/ 

Also Read : SBI PO Recruitment 2020: ఎస్‌బీఐలో భారీగా పీఓ పోస్టులకు నోటిఫికేషన్

మొత్తం పోస్టులు 125
ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)- 60
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)- 25
ట్రైనీ ఇంజనీర్ (మెకానికల్)- 18
ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)- 15
ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్)- 2
ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్)- 2
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 2
ప్రాజెక్ట్ ఆఫీసర్ (HR)- 1

Also Read : Fast Internet Tips: మీ మొబైల్ ఇంటర్నెట్ స్లో అయిందా.. ఈ టిప్స్ పాటించండి

బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్‌సైట్‌ http://www.mhrdnats.gov.in/ లో డిసెంబర్ 2 లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000 వరకు వేతనం లభిస్తుంది.

Also Read : LPG Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 క్యాష్ బ్యాక్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News