Banks 5 Days Week and Timings: త్వరలో బ్యాంకులకు 5 డే వీక్, కొత్త పనివేళలు ఇవే

Banks 5 Days Week and Timings: వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు బ్యాంకులకు మధ్య ఒప్పందం పూర్తయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 9, 2024, 12:41 PM IST
Banks 5 Days Week and Timings: త్వరలో బ్యాంకులకు 5 డే వీక్, కొత్త పనివేళలు ఇవే

Banks 5 Days Week and Timings: 5 డే వీక్ కోసం బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడమే ఆలస్యం వారానికి ఐదు రోజుల పని దినాలు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాలకు ఈ విషయమై ఇప్పటికే ఒప్పందం జరిగింది. 

బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పని అనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. వాస్తవానికి ఇదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇప్పటి నాలుగు ఆదివారాలతో పాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటోంది. ఇప్పుడు 5 డే వీక్ ప్రారంభమైతే అదనంగా మరో రెండు శనివారాలు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాలకు మధ్య ఒప్పందం పూర్తయింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది. కేంద్రం నుంచి ఆమోదం లభించగానే మొదలవుతుంది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఏడాది చివరి నుంచి బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కావచ్చు. 

ఒకవేళ వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభమైతే కస్టమర్ల సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇందుకు తగ్గట్టే మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్‌పై ఉద్యోగ సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంతకాలు చేశాయి. దీని ప్రకారం ప్రతి శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. 

వారానికి ఐదు రోజుల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే బ్యాంకు పనివేళలు మారనున్నాయి. రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే రోజూ ఉదయం 9.45 గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయి. ప్రస్తుతం బ్యాంకు పని వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. వారానికి ఐదు రోజులు మొదలైతే ఉదయం 15 నిమిషాలు ముందుగా, సాయంత్రం 30 నిమిషాలు ఆలస్యంగా ఉంటుంది. 

Also read: AP Heavy Rains Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News