Bank Holidays in August 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. ఎందుకంటే వీటిలో చాలా వరకు ప్రాంతీయ సెలవులు ఉంటాయి. అదే విధంగా ఆగస్టు నెలలో బ్యాంకులకు 13 రోజులు సెలవులున్నాయి. ఇది పరిగణలో తీసుకుని బ్యాంకు పనులుంటే ప్లాన్ చేసుకోగలరు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సెలవుల క్యాలెండర్ విడుదల చేస్తుంటుంది. జూలై నెల ముగిసిపోతోంది. ఆగస్టు నెల సెలవుల జాబితా వచ్చింది. వచ్చే నెలలో బ్యాంకులకు 13 రోజులు సెలవులున్నాయి. ఈ సెలవుల్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకు పనులుంటే ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ సెలవుల్లో శని, ఆదివారాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ సెలవులు, జాతీయ సెలవులు ఉన్నాయి. ప్రతి నెలా 2,4 శనివారాలతో పాటు నాలుగు అదివారాలు సెలవులు ఉంటాయి. వీటితో కలిపి ఆగస్టు నెలలో మొత్తం 13 రోజులు సెలవులున్నాయి.
ఆగస్టు సెలవుల జాబితా
ఆగస్టు 3 కేర్ పూజ త్రిపురలో సెలవు
ఆగస్టు 4 ఆదివారం సెలవు
ఆగస్టు 8 రమ్ ఫాత్ సిక్కింలో సెలవు
ఆగస్టు 10 రెండవ శనివారం సెలవు
ఆగస్టు 11 ఆదివారం సెలవు
ఆగస్టు 13 పేట్రియాటిక్ డే మణిపూర్ సెలవు
ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే పబ్లిక్ హాలుడే
ఆగస్టు 18 ఆదివారం
ఆగస్టు 19 రక్షాబంధనం సెలవు
ఆగస్టు 20 శ్రీ నారాయణ జయంతి, కేరళ
ఆగస్టు 24 నాలుగో శనివారం సెలవు
ఆగస్టు 25 ఆదివారం సెలవు
ఆగస్టు 26 కృష్ణాష్టమి సెలవు
Also read: Kerala Land slide: కొండచరియలు విరిగిపడి 19 మంది సజీవసమాధి.. శిథిలాల కింద చిక్కుకున్న వందలమంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook