Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు తీరనున్నారు. ప్రస్తుతం యావత్ భారత దేశం అయోధ్య రామ మందిరంలో కొలువయ్యే రాముడి గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలోని ప్రముఖులకు అయోధ్య మందిర ట్రస్టు ఆహ్వానాలను అందజేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ నెల 22న సెలవు ప్రకటించాయి. అటు కేంద్రం ఆ రోజు హాఫ్ డే హాలిడే ప్రకటించింది. అటు దేశంలోని వాడ..వాడలా.. వీధి వీధినా..అయోధ్య రామ మందరి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రజలు ఆచరించాల్సిన కొన్ని విషయాలు ఏంటో తెలుసుకుందాం..
తేదీ 22-జనవరి 2024 నాడు అయ్యోధలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా పెద్దలు ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు.. అవేంటో చూద్దాం..
గ్రామము,కాలనీ అసోసియేషన్/బస్తీ అధ్యక్షులు మరియు పెద్దలు, సభ్యులు తమ తమ కాలనీ/బస్తీ వీధుల్లో కాషాయ తోరణాలు,జెండాలు మామిడి తోరణాలు కట్టించాలి. మరియు మీ కాలనీ లోని ప్రతి దేవాలయాన్ని శుభ్రం చేయించి ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి.
మీ సమీప దేవాలయంలో ఉదయం 10-00 నుండి 11.00 వరకు రామనామ భజనలతో పాటు సంకీర్తనలు చేసేలా ప్రోత్సహించాలి. అటు ఉదయం 11.00 నుండి 12-30 వరకు అయోద్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా చేయాలి. అదే సమయానికి శంఖానాదం,ఘంటానాదం చేసేలా చూడాలి.
అక్కడే సామూహికంగా TV స్క్రీన్ పై ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దర్శించండి.!
సామూహికంగా పురోహితుల ద్వారా ఆశీఃర్వాదము తీసుకోండి.!
ప్రతి కుటుంబం తమ తమ ఇంటి పై కాషాయ జెండా ఎగురవేయండి..
ద్వారం ముందు ముగ్గు వేయండి.! గుమ్మానికి మామిడాకులు, బంతిపూలు కట్టుకోండి.
శ్రీ రామ ప్రతిమను లేదా పటాన్ని పూజించండి.!
"శ్రీ రామ జయ రామ జయ జయ రామ" విజయమంత్రాన్ని 108 సార్లు జపంచండి.! వీలైనంత ఎక్కువగా సార్లు చేసేలా ప్రోత్సహించాలి.
బాలరాముని ప్రతిష్ఠ పూర్తి అయిన తరువాత శ్రీరామపూజిత పవిత్ర అక్షతలను మీ పై మీ కుటుంబ సభ్యుల పై ఆశీర్వాదపూర్వకంగా శిరసుపై ధరించండి.!
5 శతాబ్దాల సుధీర్ధ నిరీక్షణకు గుర్తుగా ఇంటి ముందు 5 దీపాలు వెలిగించండి.! దీపోత్సవము జరుపుకోండి.!
ఈ విధముగా చేసి ఆ రాముని కృపకు పాత్రలు కండి.
Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్
Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?