Ayodhya Ram Mandir: రాములోరి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. 6 రోజుల్లో 19 లక్షల మంది..!

Ayodhya Ram Mandir Live: అయోధ్య బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత అయోధ్య నగరి రామనామస్మరణతో మార్మోగిపోతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 08:07 PM IST
Ayodhya Ram Mandir: రాములోరి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. 6 రోజుల్లో 19 లక్షల మంది..!

Ayodhya Ram Mandir Updates in Telugu: రాములోరి దర్శించుకునేందుకు అయోధ్యకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 19 లక్షల మంది దర్శించుకున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. నిన్నటి వరకు 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించినట్లు యోగి సర్కారు పేర్కొంది. నిన్న 3.25 లక్షల మంది భక్తులు రామదర్శనం చేసుకున్నారు. 

జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య 'బాలక్ రామ్' ప్రాణప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఆ వేడుకను చూసేందుకు దేశ నలుమూలల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. అయితే సామాన్య భక్త జనానికి మాత్రం జనవరి 23 నుంచి దర్శనభాగ్యం కల్పించారు. రాములోరితోపాటు ఈ భవ్యమైన మందిర నిర్మాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివెళ్తున్నారు. కేవలం ఆరు రోజుల్లోనే 19 లక్షల మంది రామయ్య దర్శనం చేసుకున్నారు. 

రామ మందిర సాకారంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దర్శనాలకు అనుమతించిన తొలి రోజే (జనవరి 23)న 5 లక్షల మంది దర్శించుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులు భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 4.5 లక్షలు మంది మాత్రమే దర్శించుకున్నారు. జనవరి 26న 3.5 లక్షలు, జనవరి 27న 2.5 లక్షల మంది, జనవరి 28న 3.25 లక్షల మంది భక్తులు బాల రాముడి దర్శనానికి వచ్చినట్టు యూపీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో.. ఆలయంలో ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం ఓ విశిష్ట కమిటీని కూడా ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడూ ఈ కమిటీ పరిశీలిస్తోంది. 

Also Read: Rajyasabha Elections 2024: దేశంలో 56 రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

Also Read: Maharashtra: ఓయో రూమ్ లో షాకింగ్ ఘటన.. ప్రియురాలిని మాట్లాకుందామని పిలిచి.. ఆ తర్వాత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News