Attack on Asaduddin Owaisi residence: అసదుద్దీన్ ఒవైసి నివాసంపై దాడి.. గేటు ధ్వంసం

Attack on Asaduddin Owaisi's official residence in Delhi: అసదుద్దీన్ ఒవైసికి కేటాయించిన అధికారిక నివాసంపైనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2021, 12:43 AM IST
Attack on Asaduddin Owaisi residence: అసదుద్దీన్ ఒవైసి నివాసంపై దాడి.. గేటు ధ్వంసం

Attack on Asaduddin Owaisi's official residence in Delhi: ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోని అశోక రోడ్డులో ఎంపీ అసదుద్దీన్ ఒవైసికి కేటాయించిన అధికారిక నివాసంపైనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు.. దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బదులుగానే తాము ఈ దాడులకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించారు. 

ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దాడులతో తమను భయపెట్టాలని చూస్తే.. అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదని అన్నారు. '' పిరికిపందలు కాబట్టే తాను ఇంట్లో లేని సమయం చూసి గుంపులు గుంపులుగా వచ్చి దాడికి పాల్పడ్డారు. దుండగుల చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి. ఇంటిపై రాళ్లు రువ్వారు. తన ఇంటి నేమ్ ప్లేట్‌ను కూడా ధ్వంసం చేశారు. బహుశా వారికి మజ్లిస్ పార్టీ (AIMIM party) ఏ ప్రాతిపదికన ఏర్పడిందో తెలిసుండకపోవచ్చునేమో. ఇలాంటి దాడులకు పాల్పడి తమను అడ్డుకోలేరని.. న్యాయం కోసం తమ పోరాటం ఆపేది లేదు'' అని స్పష్టంచేశారు. 

Also read : Kejriwal promises: గోవా యువతకు అరవింద్‌ కేజ్రీవాల్‌ వరాల జల్లు.. కారణం అదే, ఒరిజనల్ ఉండగా డూప్లికేట్ ఎందుకంటూ గోవా సీఎంపై కామెంట్

గత 40 ఏళ్లుగా ఈ ఇంటికి రక్షణగా ఉంటున్న రాజు అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. మతపరమైన నినాదాలు చేస్తూ దాడులకి దిగారు. రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసి (Asaduddin Owaisi residence) తెలిపారు. 

Also read : Kerala: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్..! ఎలాగో తెలుసా?

Asaduddin Owaisi's question to Amit Shah: అమిత్ షాకు అసదుద్దీన్ ఒవైసి సూటి ప్రశ్న:
పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ మా ఇంటికి సమీపంలోనే ఉంది. మా ఇంటి పక్కనే ఎన్నికల సంఘం కార్యాలయం ఉంది. ప్రధాని మోదీ అధికారిక నివాసానికి సమీపంలోనే ఉన్న ఒక ఎంపీ అధికారిక నివాసానికే రక్షణ లేకపోతే కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఇక సామాన్యులకు ఏం భరోసా ఇవ్వగలరు ? అని అసదుద్దీన్ ఒవైసి ప్రశ్నించారు.

Also read : Quad Meet: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని మోదీ భేటీ సెప్టెంబర్ 24న ఖరారు

అతివాదాన్ని నిర్మూలించాలని ప్రధాని మోదీ (Asaduddin Owaisi's comments on PM Narendra Modi) ప్రపంచానికి ప్రచవనాలు చెబుతుంటారు. మరి ఈ దాడికి పాల్పడిన గూండాలకు అతివాదం నేర్పింది ఎవరో చెప్పాలని ఒవైసీ ఎద్దేవా చేశారు.

Also read : Auto Debit New Rules: ఆటోడెబిట్ ఇకపై అంత ఈజీ కాదు, అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News