Covid Caller Tune: దేశంలో దాదాపు రెండేళ్ల తర్వాత కరోనా కేసులు అత్యల్ప స్థాయికి చేరాయి. రోజువారి కొవిడ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కాలర్ ట్యూన్‌ను త్వరలో నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఏమిటి ఈ కాలర్ ట్యూన్..
దేశంలో కొవిడ్ విజృంభణ తర్వాత.. ప్రతి ఒక్కరికి ఈ మహమ్మారి గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. టీవీల్లో ప్రకటనలు ఇవ్వడం సహా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఫోన్ చేసిన ప్రతిసారి కొరోనా జాగ్రత్తలు తెలుపే విధంగా ఓ కాలర్ ట్యూన్‌ను తీసుకొచ్చిది. ఆ తర్వాత అర్హులంతా వ్యాక్సినేషన్ తీసుకునేలా ప్రోత్సహిస్తూ కాలర్ ట్యూన్‌ను అప్డేట్ చేసింది. ఇలా ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి కాలర్ ట్యూన్లో మార్పులు చేసింది.
ఫోన్ చేసిన ప్రతిసారి ఈ కాలర్ ట్యూన్ ముగిసిన తర్వాతే.. కాల్ కలిసేది. అయితే అత్యవసర సమయాల్లో.. కాలర్ ట్యూన్ మోగిన తర్వాతే కాల్ కనెక్ట్ అవ్వడం పట్ల చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఈ విషయాన్ని పలు మార్లు సంబంధించి వర్గాల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే కొవిడ్ విఙృంభణ కారణంగా కాలర్ ట్యూన్‌ను తొలగించలేదు ప్రభుత్వం.
అయితే ఎట్టకేలకు.. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా తగ్గటం.. అర్హుల్లో అత్యధికశాతం టీకాలు తీసుకోవడం వంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్లే.. ఈ నెల తర్వాత మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం మినహా.. మిగతా అన్ని కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇక ఇదే సమయంలో కొవిడ్ కాలర్ ట్యూన్‌కు కూడా స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also read: Attack on CM: సీఎం భద్రతలో లోపం.. దాడికి యత్నించిన యువకుడు!
Also read: Shiva Lingam: కోర్టుకు హాజరైన శివ లింగం.. నెట్టింట్లో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook