Crazy Lover: ప్రియురాలిని కలవడం కోసం గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన ఎలక్ట్రిషియన్‌, చివరికి ఏమైందంటే..?

Crazy Lover: ప్రేమ ఎంతకైనా తెగించేలా చేస్తది. ప్రేమలో మునిగి తేలుతున్న జంటలు క్రేజీ క్రేజీగా ఆలోచిస్తాయి. తాజాగా అలాగే కొంచెం క్రేజీగా ఆలోచించి గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడో ఎలక్ట్రిషియన్‌. ఇంతకీ అతను చేసిన నేరమేంటీ..?

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 04:34 PM IST
  Crazy Lover: ప్రియురాలిని కలవడం కోసం గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన ఎలక్ట్రిషియన్‌, చివరికి ఏమైందంటే..?

Crazy Lover: ప్రేమ ఎంతకైనా తెగించేలా చేస్తది.  ప్రేమలో మునిగి తేలుతున్న జంటలు క్రేజీ క్రేజీగా ఆలోచిస్తాయి. తాజాగా అలాగే కొంచెం క్రేజీగా ఆలోచించి గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడో ఎలక్ట్రిషియన్‌. అది బీహార్‌ రాష్ట్రంలోని పుర్నియా జిల్లా గణేష్‌పూర్‌ గ్రామం. ఉన్నపలాంగా ఒక్కసారిగా గ్రామంలో విద్యుత్‌ సరఫరా ఆగిపోతోంది. ఇది ఒక్కసారికాదు.. గత కొద్దినెలలుగా ఇదే తంతు. పక్క గ్రామాలకు లేని విద్యుత్‌ కోతలు మనకే ఎందుకని ఆరా తీయడం మొదలుపెట్టారు గ్రామస్తులు. చివరకు వారికి షాకింగ్‌ విషయం తెలిసింది. విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తోంది అధికారులు కాదు.. ఓ ఎలక్ట్రిషియన్‌ అని తేలింది. తన ప్రియురాలిని కలిసేందుకు కరెంట్‌ కట్‌ చేస్తున్నాడు గుర్తించారు.

ఆ ఎలక్ట్రిషియన్‌ ను పట్టుకునేందుకు గ్రామస్తులు పథకం రచించారు. అనుకున్నట్టుగానే ఆ ఎలక్ట్రిషియన్‌  రోజులాగే కరెంట్‌ చేసి.. తన ప్రియురాలితో కలిసి ప్రభుత్వ స్కూల్‌ లో ఉన్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ ఇద్దరినీ పట్టుకున్నాడు.  ప్రేమికురాలిని కలవాలంటే ఎన్నో మార్గాలు ఉండగా.. గ్రామం మొత్తానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన ప్రేమ కోసం గ్రామంలోని చిన్నారులు, వృద్ధులను ఇన్నాళ్లుగా కష్టపెట్టాడంటూ అతనిపై ఫైర్‌ అయ్యారు. అంతటితో ఆగకుండా ఆ ఎలక్ట్రిషియన్‌ ను చితక్కొట్టి గ్రామంలో ఊరేగించారు.

చివరకు ఆ ఎలక్ట్రిషియన్‌ కు గ్రామస్తులు అందరూ ట్విస్ట్‌ ఇచ్చారు. ఇన్నాళ్లుగా ఏ ప్రేమికురాలిని కలుసుకోవడం గ్రామానికి వస్తున్నాడో.. ఆ మహిళతోనే అతనికి వివాహం జరిపించారు. గ్రామ సర్పంచ్‌, పెద్దలు కలిసి  వారిద్దరికీ పెళ్లి జరిపించారు. ఆ తర్వాత గ్రామస్తులు ఆ వ్యక్తిపై ఎలాంటి పోలీస్‌ కేసు నమోదు చేయలేదు.

Also Read: Tomoto Fever: చిన్నారులపై టమాట ఫ్లూ ప్రభావం, తమిళనాడు కేరళ సరిహద్దుల్లో వైద్యుల పరీక్షలు..!

Also Read: Black Turmeric: నల్ల పసుపుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News