ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసు: చిదంబరానికి మళ్లీ ఊరట..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంకు ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసులో మళ్లీ ఊరట లభించింది.

Last Updated : Jun 5, 2018, 07:36 PM IST
ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసు: చిదంబరానికి మళ్లీ ఊరట..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరానికి ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసులోమళ్లీ ఊరట లభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని జులై 10 వరకు అరెస్టు చేయవద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌‌ను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. చిదంబ‌రం వేసిన బెయిల్ పిటీష‌న్‌పై సమాధానం ఇచ్చేందుకు ఈడీ మ‌రింత స‌మ‌యాన్ని కోరడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసులో వివరణాత్మక సమాధానాన్ని దాఖలు చేయడానికి సమయం అడగడంతో.. ఈ కేసు తదుపరి విచారణను జూలై 10కి కోర్టు వాయిదా వేసింది. కాగా అదే రోజున ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో కార్తీ చిదంబరంపై విచారణ జరగనుంది.

 

 

అంత‌క‌ముందు కూడా ఓ సారి ఈ కేసులో ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు చిదంబరాన్ని అరెస్టు చేయొద్దని, తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే!

ఇదిలా ఉండగా.. నేడు చిదంబరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరు కానున్నారు. ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసులో జూన్ 5న విచారణకు తమ ఎదుట హాజరు కావాలని చిదంబరానికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే!

 

Trending News