Volvo FM12 truck ఏడాది ప్రయాణంచి.. 1700 కి.మీ గమ్యాన్ని చేరింది

VSSC Aerospace Autoclave | 1700 కిలోమీటర్లు. సాధారణంగా అయితే  ఏదైనా ట్రక్కు ఓ అయిదారు రోజుల్లో ఈ దూరాన్ని చేరుతుంది. కానీ నాసిక్ నుంచి తిరువనంతపురం చేరడానికి ఓ ట్రక్కుకు దాదాపు 11 నెలల సమయం పట్టింది. 

Last Updated : Jul 20, 2020, 02:05 PM IST
Volvo FM12 truck ఏడాది ప్రయాణంచి.. 1700 కి.మీ గమ్యాన్ని చేరింది

మహారాష్ట్రలోని నాసిక్ నుంచి తిరువనంతపురం మధ్య గల దూరం 1700 కిలోమీటర్లు (Nashik to Thiruvananthapuram Truck Journey). సాధారణంగా అయితే  ఏదైనా ట్రక్కు ఓ అయిదారు రోజుల్లో ఈ దూరాన్ని చేరుతుంది. కానీ నాసిక్ నుంచి తిరువనంతపురం చేరడానికి ఓ ట్రక్కుకు దాదాపు 11 నెలల సమయం పట్టింది. 2019లో బయలుదేరిన భారీ ట్రక్కు నేటి ఉదయం తిరువనంపురం చేరుకోవడం గమనార్హం. డ్యాన్స్‌తో దుమ్మురేపుతున్న Covid19 పేషెంట్స్

అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన ఓ ఏరోస్పేస్ భారీ మెషీన్‌ను నాసిక్‌లో గతేడాది తయారుచేశారు. దాని బరువు ఏకంగా 70 టన్నులు కాగా, పొడవు దాదాపు 30 మీటర్లు, ఎత్తు 7.5 మీటర్లు, వెడల్పు 6.65 మీటర్లు అని సమాచారం. ఈ ఏరోస్పేస్ పరికరాన్ని 74 టైర్ల వాహనం వోల్వో ఎఫ్ఎం12 ట్రక్కు ద్వారా నాసిక్ నుంచి తిరువనంతపురం(కేరళ)లోని విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రానికి (Vikram Sarabhai Space Centre) తీసుకొచ్చారు. ENG vs WI: మ్యాచ్ ఆపి.. బంతిని శానిటైజ్ చేసిన అంపైర్

భారీ వాహనం, అందులోనూ ఇస్రో (ISRO) అంతరిక్ష సంబంధిత ఆటోక్లేవ్ పరికరాలతో ప్రయాణం అంత తేలిక కాదు. రోజుకు కేవలం 5 కి.మీ మేర ప్రయాణానికి అనుమతి ఉంది. ఈ కారణంగా సుదీర్ఘకాలం తర్వాత భారీ ట్రక్కు తన గమ్యాన్ని చేరుకుంది. ఇంజనీర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు సహా మొత్తం 30 మంది ట్రక్కు (Volvo FM12 Truck)తో పాటు ప్రయాణించడం గమనార్హం.  మోడల్ Shweta Mehta Hot Photos వైరల్

మధ్యలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించడంలో నెలరోజులు ప్రయాణం సాగలేదు. దాదాపు ఐదు రాష్ట్రాల మీదుగా ప్రయాణించి తమ గమ్య స్థానాన్ని చేరుకున్నామని ట్రక్కుతో పాటు ప్రయాణించిన ఓ సభ్యుడు తెలిపాడు. ఆటోక్లేవ్ (VSSC Aerospace Autoclave) కార్యక్రమాలతో పాటు అంతరిక్ష సంబంధిత పరికరాలు నాసిక్‌లో ఉత్పత్తి చేసి అవసరమైన కేంద్రాలకు తరలించడం తరచుగా జరుగుతుందని వివరించాడు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News