7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు

7th Pay Commission Latest Updates DA Hike News: రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రమోషన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. గ్రేడ్‌ల వారీగా నిబంధనలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2023, 04:26 PM IST
7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు

7th Pay Commission Latest Updates DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు డీఏ పెరుగుతోంది. ఈ సంవత్సరం మొదటి డీఏ ప్రకటన మార్చిలో వచ్చింది. 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి చేరుకుంది. పెంచిన డీఏను జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేసింది. ప్రస్తుతం రెండో డీఏ పెంపునకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం.. ఈసారి కూడా 4 శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తుందని అంటున్నారు. డీఏ పెంపుతోపాటు పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏపై కేంద్రం ప్రకటన ఉందని నమ్మకంతో ఉన్నారు. ఇక రెండో డీఏ పెంపు ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉండగా.. జూలై 1వ తేదీ నుంచి వర్తించనుంది. దసరా గిఫ్ట్‌గా డీఏ ప్రకటించే ఛాన్స్ ఉంది.
 
ఇక తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఏడవ వేతన సంఘం కింద జీతాలు పొందుతున్న ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ప్రమోషన్ నిబంధనలలో ప్రభుత్వం మార్పులు చేసి నోటిఫికేషన్ జారీ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖలోని డిఫెన్స్ సివిల్ ఉద్యోగుల కోసం ప్రమోషన్ జాబితాను రిలీజ్ చేసింది. కనీస సర్వీసు నిబంధనలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ ఉద్యోగుల కోసం సవరించిన ప్రమాణాలను సెట్ చేసింది. 

ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రమోషన్ కోసం అర్హత గురించి పూర్తి సమాచారం ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది. గ్రేడ్‌ల వారీగా జాబితాను వెల్లడించింది. ప్రతి లెవల్ ను బట్టి ప్రమోషన్ ప్రమాణాలను పేర్కొంది. దీంతో పాటు మెమోరాండం కూడా జారీ చేసింది. 

ప్రమోషన్ కోసం సర్వీస్ జాబితా ప్రకారం.. లెవల్ 1 నుంచి 2, 2 నుంచి 3 వరకు ఉద్యోగులకు మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. లెవల్ 2 నుంచి 4 వరకు 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. లెవల్ 3 నుంచి 4 వరకు ఐదేళ్ల అనుభవం ఉండాలి. 6 నుంచి 11 స్థాయిలకు 12 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. దీని ఆధారంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పిస్తారు. 

Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 15 వరకూ ఏపీలో భారీ వర్షాలు

Also Read: Chandrababu Case: హైకోరులో చంద్రబాబుకు నిరాశ, క్వాష్ పిటీషన్ విచారణ వారం వాయిదా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News