సీరియల్ చూసి.. ఒంటికి నిప్పంటించుకున్న ఏడేళ్ల పాప !

ముక్కుపచ్చలారని పసిపాప అగ్నితి ఆహుతైంది. ఏడేళ్ల ప్రార్థన ఒంటికి నిప్పంటిచుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేవనగరే జిల్లా హరిహర పట్టణంలో  ఆలస్యంగా వెలుగు చూసింది. తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివరాలు బహిర్గతం అయ్యాయి.

Last Updated : Nov 29, 2017, 05:31 PM IST
సీరియల్ చూసి.. ఒంటికి నిప్పంటించుకున్న ఏడేళ్ల పాప !

బెంగళూరు: ముక్కుపచ్చలారని పసిపాప అగ్నితి ఆహుతైంది. ఏడేళ్ల ప్రార్థన ఒంటికి నిప్పంటిచుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలోని దేవనగరే జిల్లా హరిహర పట్టణంలో  ఆలస్యంగా వెలుగు చూసింది. తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివరాలు బహిర్గతం అయ్యాయి.

ఏడేళ్ల ప్రార్థన టీవీలో ప్రసారమయ్యే  రెండు సీరియళ్లను బాగా చూసేది. అందులో ఒక సీరియల్ లో పాపకు ఇష్టమైన పాత్ర అగ్నిలో డాన్స్ చేస్తుంది. అది చూసి ప్రభావితమైన ప్రార్ధన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి నిప్పంటించుకొని అలానే ప్రయత్నం చేసింది.  దాంతో ప్రాణాలు పోగొట్టుకుంది. మేము సీరియళ్లు చూడవద్దని ఎన్ని సార్లు వారించినా.. పాప వినేది కాదని ఫిర్యాదు చేసిన తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తల్లితండ్రులు పిల్లలకు సీరియళ్లు చూపించవద్దని వేడుకున్నారు. ఈ ఘటన కర్ణాటక చర్చ కావడంతో టీవీ నటీనటులు ప్రార్ధన కుటుంబానికి పరామర్శలు తెలియజేశారు.

Trending News