Saharanpur Gangrape: కట్టెల కోసం వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్.. అంతటితో ఆగని దుర్మార్గులు!!

సహరాన్‌పూర్ జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్మల్‌పూర్ గ్రామానికి చెందిన ఓ 45 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది.  నిందితులు వీడియోను వైరల్ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 05:41 PM IST
  • ఉత్తరప్రదేశ్‌లో ఆగని అత్యాచారాలు
  • కట్టెల కోసం వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్
  • వీడియోను వైరల్ చేయడంతో
Saharanpur Gangrape: కట్టెల కోసం వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్.. అంతటితో ఆగని దుర్మార్గులు!!

Woman gang raped by three men in Saharanpur: దేశంలో ఎన్ని చట్టాలు అమల్లోకి వచ్చినా.. మహిళలపై మాత్రం అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతిరోజు దేశ నలుమూలలో ఎవరో ఒకరు అత్యాచారంకు గురవుతున్నారు. బయటికి వెళ్లిన మహిళ క్షేమంగా ఇల్లు చేరని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో. మహిళలపై జరుగుతున్న నేరాలకు అక్కడ అంతం లేకుండా పోయింది. తాజాగా కట్టెల కోసం పొలంకు వెళ్లిన ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. అక్కడితో ఆగకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు దుర్మార్గులు. 

హిందీ దినపత్రిక హిందుస్థాన్‌లో వచ్చిన కథనం ప్రకారం... సహరాన్‌పూర్ జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్మల్‌పూర్ గ్రామానికి చెందిన ఓ 45 ఏళ్ల మహిళ జనవరి 21న కట్టెల కోసం పొలంకు వెళ్లింది. చుట్మల్‌పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెను కత్తితో బెదిరించి.. పొలంలోకి ఈడ్చుకెళ్లారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఆ దృశ్యాలను వీడియో కూడా తీశారు. 

ఈ విషయం పోలీసులకు లేదా ఎవరికైనా చెపితే చంపేస్తామని ఆ మహిళను ముగ్గురు దుర్మార్గులు బెదిరించారు. అయితే గత ఆదివారం నిందితులు వీడియోను వైరల్ చేయడంతో బాధితురాలు అదేరోజు సాయంత్రం ఫతేపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనపై బనార్సీ, రవికాంత్ మరియు వినోద్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకుని ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.

Also Read: IPL 2022: భారత్‌లోనే ఐపీఎల్ 2022.. స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ! కానీ..!!

Also Read: పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు.. మండిపడిన 'డీజే టిల్లు' హీరోయిన్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News