'కరోనా వైరస్' మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే దేశ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. ధనిక, పేద, ఆడ,మగ, పిల్లలు, పెద్దలు అనే తేడాలేవీ లేకుండా అందరినీ కబళిస్తోంది. అందరికీ కరోనా మహమ్మారితో భయం ఉంది.
రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారు కరోనాను జయించి తిరిగి జీవితాన్ని పట్టాలెక్కించుకుంటున్నారు. రోగ నిరోధక శక్తి లేని వారు ఆ మహమ్మారికి బలైపోతున్నారు. ఎవరికి ఎంత వయసు ఉన్నదన్నది ముఖ్యం కాదు.. రోగనిరోధక శక్తి ఎంత ఉందన్నదే ముఖ్యంగా మారింది. నిజానికి వృద్ధులు, పిల్లలు, స్త్రీలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో వారే ఎక్కువగా ఈ మహమ్మారికి బలవుతున్నారు. అత్యధికంగా వృద్ధులే మృత్యువాతపడుతున్నారు.
ఐతే వృద్ధుల్లోనూ కొంత మంది కరోనాను జయించడం చూశాం. ఇప్పుడు ముంబైలో 36 రోజుల పసిపిల్లాడు కూడా కరోనా మహమ్మారిని జయించి మృత్యుంజయుడుగా తిరిగి వచ్చాడు. అవును ఈ ఘటన ముంబైలోని సియాన్ పిల్లల ఆస్పత్రిలో జరిగింది. అభం, శుభం తెలియని ఆ చిన్నారి బాలుడు పుట్టిన తర్వాత అతి కొద్ది రోజులకే కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. దాదాపు 15 రోజుల చికిత్స అనంతరం పసివాడికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
36 రోజుల వయసులోనే బాలుడు కరోనాను జయించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న సమయంలో ఆ అజేయున్ని అభినందించారు. వైద్యులు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బంది అంతా చప్పట్లతో వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను మహారాష్ట్ర సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.
For people of Maharashtra, age is no bar when it comes to putting up a fight. 36 days old baby recovered from COVID-19 at Sion Hospital in Mumbai. Kudos to the team of Doctors, Nurses & Ward Boys 👏🏼👏🏼 @mybmc pic.twitter.com/UmWOtY2JnG
— CMO Maharashtra (@CMOMaharashtra) May 27, 2020
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..