CoronaVirus Updates: న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనాతో దేశంలో గడిచిన 24 గంటల్లో 34 మంది మృత్యువాత పడగా, తాజాగా 909 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 273కు చేరుకోగా, పాజిటీవ్ కేసుల సంఖ్య 8356గా ఉంది. ఇందులో చికిత్స అనంతరం కోలుకుని 716 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.. Must Read: పింఛన్‌లో 30% కోత పడనుందా!
కాగా, కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగియనుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కనీసం మరో 2 వారాలపాటు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 11న) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని చర్చించారు. లాక్‌డౌన్ గడువును పొడిగించడమే సరైన నిర్ణయమని చర్చించినట్లు సమాచారం. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
బుల్లితెర భామ టాప్ Bikini Photo