కులూ: హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కులూ జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం పాలుకాగా మరో 35 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కులూ జిల్లాలోని బంజర్ నుంచి గదగుశానికి వస్తుండగా బంజర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఘటనాస్థలానికి చేరుకున్న సహాయ బృందాలు సహాయ చర్యలు చేపట్టి బాధితులను రక్షించి లోయలోంచి బయటికి తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. బయటికి తీసుకొచ్చిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.