16 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. ప్రధాని మోదీకి 18-Pages suicide note

పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , అవినీతి, చెట్ల నరికివేత ( Pollution, corruption, deforestation ) వంటి సామాజిక అంశాలపై విసుగు చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక తనని తాను రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంబల్‌లో చోటుచేసుకుంది.

Last Updated : Aug 19, 2020, 11:56 PM IST
  • తనని తాను రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన 16 ఏళ్ల బాలిక.
  • పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , అవినీతి, చెట్ల నరికివేత ( Pollution, corruption, deforestation ) వంటి సామాజిక అంశాలపై విసుగు చెందినట్టు ఆవేదన వ్యక్తంచేస్తూ 18 పేజీల సూసైడ్ నోట్.
  • ప్రధాని మోదీని కలిసి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఉండేదని కోరికను వెలిబుచ్చిన బాలిక.
  • కూతురి సూసైడ్ నోట్‌ని ప్రధాని మోదీ వరకు తీసుకెళ్తామని చెబుతున్న బాలిక తల్లిదండ్రులు.
16 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. ప్రధాని మోదీకి 18-Pages suicide note

బరేలి: పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , అవినీతి, చెట్ల నరికివేత ( Pollution, corruption, deforestation ) వంటి సామాజిక అంశాలపై విసుగు చెందిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక తనని తాను రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంబల్‌లో చోటుచేసుకుంది. ఐతే అంతకంటే ముందుగా ఆమె తన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితిని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి 18 పేజీల లేఖ రూపంలో ఓ సూసైడ్ నోట్ ( 18 pages suicide note ) రాసింది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం సూసైడ్ నోట్ లభించిన అనంతరమే బాలిక ఆత్మహత్య వెనుకున్న కారణం ఏంటో తెలిసింది. సూసైడ్ నోట్‌లో 16 ఏళ్ల బాలిక ప్రస్తావించిన అంశాలు, ఆమె ఆవేదన వ్యక్తంచేసిన తీరు ఆమె తల్లిదండ్రులను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. Also read : Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. నేరం అంగీకరించిన షార్ప్ షూటర్

ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఈ సామాజిక అంశాల సమస్యకు పరిష్కారం కోసం చర్చించాలని ఉండేదని ఆ బాలిక తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. నానాటికి పెరుగుతున్న జనాభాను కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని మోదీని కోరిన ఆ బాలిక.. దీపావళి నాడు పటాసులు కాల్చడం ( Ban on firecrackers), హోలీ పండగ నాడు రసాయనిక రంగులతో ( chemical-based colours ) హోలీ ఆడటం వంటి వాటిపై కఠిన నిషేధం విధించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వయసైపోయిన తల్లిదండ్రులు ( Old age parents ) వారి పిల్లల చేతుల్లోనే నిరాధరణకు గురవుతున్న తీరుపైనా ఆ బాలిక తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపుతున్న పిల్లలు ఉన్న ఈ సమాజంలో తాను ఇంకా బతకాలని అని అనుకోవడం లేదని ఆ బాలిక ఆవేదన వ్యక్తంచేసిన తీరు అందరినీ కలచివేసింది. Also read : SP Balasubrahmanyam: విషమంగానే బాలు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల

కూతురు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం ఆమె తండ్రి స్పందిస్తూ.. తన కూతురి చివరి కోరికను ప్రధాని మోదీ ( PM Narendra Modi ) వరకు చేరేలా చేయడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యంగా భావిస్తామని అన్నారు. సాధారణ మధ్యతరగతి రైతు అయిన బాలిక తండ్రి.. ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తిచేసినట్టు తెలిపారు. Also read : APSRTC employees: ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి గుడ్ న్యూస్

Trending News