Bus falls off bridge in MP's Khargone: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖర్గోన్ జిల్లాలో ఇండోర్‌కు వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి పడిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు, క్షతగాత్రులకు రూ.25 వేలు ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో 70-80 మంది ప్యాసింజర్స్ ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి పడినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు ఓ బస్సు ముంబైలోని పశ్చిమ శివారు అంధేరీలోని ఒక దుకాణంపైకి దూసుకెళ్లింది. అంధేరి (తూర్పు)లోని మహంకాళి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల వాహనం దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, దుకాణానికి కొంత నష్టం వాటిల్లింది. డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also read: TN board exam: ప్లస్ టూ ఫలితాల్లో కార్పెంటర్ కూతురు సంచలనం.. 600కు 600 మార్కులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Madhya Pradesh: బ్రిడ్జి పై నుంచి పడిన ప్యాసింజర్ బస్సు.. 15 మంది దుర్మరణం..