Hyderabad Thunder Rains: హైదరాబాద్ లో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు జన జీవనం స్తంభించిన పోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంత దీంతో ఉరుముల శబ్దాలకు సిటీ ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. . రెండు మూడు గంటల పాటు మెరుపులు, ఉరుములు కొనసాగాయి. భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలో జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇక శనివారం రోజున హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా మెహదీపట్నం, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో 9 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయింది. సాయంత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఓ గంట పాటు కురిసిన భారీ వర్షంతో నగర వాసులు చిగురుటాకులా వణికి పోయారు. అంతేకాదు ఆఫీసులు, ఇతరత్రా పనులపై బయటకు వెళ్లినవారు వర్షం చిక్కుకొని తీవ్ర నరక యాతన అనుభవించారు. కిలోమీటరు ప్రయాణానికి దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. పలు చోట్ల వర్షానికి కార్లు, మోటారు సైకిళ్ల మొరాయించాయి.
వర్షం నేపథ్యంలో రోడ్లపై ఒదిలేసి మెట్రో రైలును ఆశ్రయించారు. అక్కడ కూడా ఇసుకేస్తే రాలనంత జనంతో ఉన్నారు. దీంతో ప్రయాణికలు అక్కడ కూడా తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలపై అల్ప పీడన ప్రభావంతో రానున్న మూడో రోజులు పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.