What is Menstrual Cycle: మహిళలు నిర్ణీత వయస్సు వచ్చినప్పుుడు జరిగే రక్తస్రావాన్ని రజస్వలగా పిలుస్తారు. ఇదే పరిస్థితి నిర్ణీత కాలవ్యవధిలో రావడాన్ని నెలసరి లేదా బహిష్టు లేదా పీరియడ్స్ అంటారు. ప్రతి నెలా 4-7 రోజుల వ్యవధిలో ఉంటుంది. ఈ సమయంలో మహిళలు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ వివరాలు మీ కోసం..
ప్రకృతిలో మహిళలు, పురుషుల శరీర నిర్మాణంలో తేడా ఉంటుంది. సంతానం కనేది మహిళలు కావడం వల్ల వారిలో ప్రత్యేక నిర్మాణం, ప్రత్యేక హార్మోన్లు ఉంటాయి. అమ్మాయిలు నిర్ణీత వయస్సు వచ్చినప్పుడు తొలిసారిగా రజస్వల అవుతుంటారు. దీనినే మెచ్యూర్ అయిందని అంటారు. మెచ్యుర్ అవడం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో వయస్సులో ఉంటుంది. భారదదేశంలో సరాసరి మెచ్యూర్ వయస్సు 13-14 ఏళ్లు కాగా పాశ్చాత్యదేశాల్ల 9-11 ఏళ్లకే జరుగుతుంటుంది. ఇటీవలి కాలంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇండియాలో కూడా 10-12 ఏళ్లకే రజస్వల అవుతున్న పరిస్థితి ఉంటోంది.
ఈ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. గర్భాశయంలోని ఎండోమెట్రియం నిర్ణీత కాలంలో విసర్జించబడి తిరిగి కొత్తగా తయారౌతుంటుంది. దీనినే రుతుస్రావం లేదా రుతుచక్రంగా పిలుస్తారు. మెన్స్టువల్ సమయంలో అమ్మాయిలు లేదా మహిళల్లో ఓ విధమైన దుర్వాసన ఉంటుంది. తీవ్రమైన రక్తస్రావం అయినందున బలహీనత ఎక్కువగా ఉంటుంది. బాడీ పెయిన్స్, చికాకు అన్నీ ఉంటాయి. అమ్మాయిల జీవితంలో రుతుచక్రం లేదా మెన్స్టువల్ అనేది 45-48 ఏళ్ల వరకూ కొనసాగుతుంది. ఆ తరువాత ఆగిపోతుంది. ఇందులోనే ప్రీ మెన్స్టువల్ సిండ్రోమ్ లేదా పీఎంఎస్ అని ఉంటుంది. అంటే రుతుస్రావంకు ముందు కన్పించే లక్షణాలు.
ఇవి శారీరకంగా, మానసికంగా ఉంటాయి. హార్మోన్ల ఉత్పత్తిలో సమస్య కారణంగా ఈ పరిస్థితి వస్తుంటుంది. పీరియడ్స్ రావడానికి ముందు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్ స్థాయి తగ్గుతుంది. టెస్టోస్టిరోన్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా ముఖంపై మొటిమలు రావడం, కడుపు నొప్పి, బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి.
పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టెరోన్ స్థాయి పెరగడం వల్ల క్షీరగ్రంధులు విస్తరిస్తాయి. దాంతో రొమ్ములు లేదా స్తనాలు నొప్పిగా వాపు కలిగి ఉంటాయి. పీఎంఎస్ కారణంగా చికాకు ఎక్కువగా కన్పిస్తుంది. ఓ విధమైన డిప్రెషన్, ఆందోళన కూడా బాధిస్తుంది. పీరియడ్స్ సమయంలో కొందరికి శరీర ఉష్ణోగ్రత మారుతుంది. ఫలితంగా తలనొప్పి, బాడీ పెయిన్స్ సమస్యలు బాధిస్తాయి. మరోవైపు హార్మోన్లలో మార్పు కారణంగా విరేచనాలు, వికారం, గ్యాస్ వంటి సమస్యలతో పాటు మలబద్ధకం కూడా ఉండవచ్చు. అయితే ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండాలని లేదు. శరీరతత్వం, తీసుకునే ఆహారాన్ని బట్టి మారుతుంటుంది. కొందరిలో ఉండకపోవచ్చు కూడా.
పీరియడ్స్ సమయంలో, అంతకుముందు తలెత్తే పరిస్థితి నివారించేందుకు జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉంటే మంచిది. ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇందుకు సరైన ప్రత్యామ్నాయం. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి.
Also Read: Pregnancy Symptoms: మహిళల్లో Pregnancy లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ సమయంలో ఎలా ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి