Diabetic Care in Winter: శీతాకాలంలో మధుమేహం వ్యాధిగ్రస్థులకు తస్మాత్ జాగ్రత్త, ఈ టిప్స్ పాటించండి

Diabetic Care in Winter: శీతాకాలం వచ్చిందంటే ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇది మరింత ప్రమాదకరం కావచ్చు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 2, 2023, 05:58 PM IST
Diabetic Care in Winter: శీతాకాలంలో మధుమేహం వ్యాధిగ్రస్థులకు తస్మాత్ జాగ్రత్త, ఈ టిప్స్ పాటించండి

Diabetic Care in Winter: ప్రస్తుతం చలికాలం నడుస్తోంది. రోజురోజుకూ చలి పెరగడంతో పాటు సీజనల్ వ్యాధుల సమస్య పెరుగుతోంది. శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడంతో సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. అన్నింటికీ మించి రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా ప్రతికూలంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా..

చలికాలంలో మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల చాలా త్వరగా సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తుంటాయి. అదే సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా రక్త నాళాల్లో సంకోచ వ్యాకోచాలు, జీర్ణక్రియపై ప్రభావం వంటి మార్పుల కారణంగా డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో డయాబెటిస్ రోగులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేయడం అనేది కష్టమే. ఎందుకంటే హెచ్చుతగ్గులు స్పష్టంగా కన్పిస్తుంటాయి. ఈ పరిస్థితి ఆరోగ్యానికి ప్రమాదకరం. వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దాంతో రక్తంలో చక్కెర శాతం అదుపు తప్పుతుంది. బ్లడ్ షుగర్ స్థిరంగా ఉండకుండా పెరగడం లేదా తగ్గిపోవడం జరుగుతుంటుంది. చలికాలంలో అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 

అన్నింటికంటే ముఖ్యంగా రోజుకు తగినంత నిద్ర తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలి. అంటే రాత్రి నిద్ర అది కూడా ప్రశాంతమైన నిద్ర రోజుకు 7-8 గంటలు కచ్చితంగా ఉండాల్సిందే. ఈ నిద్ర పొందాలంటే రాత్రి వేళ పడుకునేముందు టీవీ లేదా మొబైల్ ఫోన్ దూరంగా పెట్టాలి. అప్పుడే నిద్ర పోగలరు. 

మధుమేహం వ్యాధిగ్రస్థులు శీతాకాలంలో చలిగాలికి బయట తిరగకూడదు. సాధ్యమైనంతవరకూ ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో కూడా వాతావరణం చలిగా ఉంటే పాదాలు, చేతులు కప్పుకునేలా ఉండాలి. శరీరం వెచ్చగా ఉండేట్టు ప్రయత్నించండి. తినే ఆహార పదార్ధాలు కూడా వేడిగానే తీసుకోవాలి. 

మనిషి శరీరానికి శారీరక శ్రమ అనేది ఎప్పుడూ అవసరం. చలికాలంలో మరింత ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. అందుకే రోజూ కనీసం 20 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఇన్సులిన్ స్థాయిపై ప్రతికూల ప్రబావం పడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే రోజూ వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరి. 

శీతాకాలంలో డయాబెటిక్ వ్యాధిగ్రస్థులు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఆహారం ఎప్పుడూ హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, బీట్‌రూట్, క్యారెట్, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి. 

Also read: Weight Loss Tips: నిమ్మ రసం, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగితే బరువు నిజంగా తగ్గుతారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News