Who Should Not Eat Moong Dal: శరీరంగా దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు తప్పకుండా ప్రోటీన్లు పుష్కలంగా ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు దూరం కావడమేకాకుండా బాడీకి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.ఉదయం అల్పాహారంలో బాగంగా నానబెట్టిన మొలకలెత్తిన పప్పులు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా శరీరం ఆరోగ్యండా ఉండడానికి పలు రకాల పంపులను కూడా తరచుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా పెసర పప్పులను అతిగా తింటూ ఉంటారు. ఇలా వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పప్పుల వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పప్పును తినడం వల్ల శరీరానికి కలిగే నష్టాలు:
1. తక్కువ రక్తపోటు సమస్యలు:
బీపీ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ పెసర పప్పును తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పప్పును అతిగా తీసుకోవడం వల్ల తక్కువ రక్తపోటు సమస్యలు వాటిల్లే అవకాశాలున్నాయి. కాబట్టి రక్త పోటు సమస్యలతో బాధపడేవారు ఈ పప్పులను తీసుకోకపోవడం చాలా మంచిది.
2. ఉబ్బరం సమస్యలు:
ఈ పెసర పప్పును అతిగా తినడం వల్ల ఉబ్బరం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ పప్పను తీసుకునే ముందు తప్పుకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పులో షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి అతిగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.
3. మధుమేహం సమస్యలు:
మధుమేహం సమస్యలతో బాధపడేవారు ఈ పప్పును కేవలం పరిమితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి మధుమేహం తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు ఈ పప్పను క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Rashmika School Girl: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook