Corona symptoms: కరోనా మహమ్మారి మరోసారి వేగంగా వ్యాపిస్తోంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
జలుబు, జ్వరం సహా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. జనాలు కరోనానేమో అని (Early symptoms of corona) భయపడిపోతున్నారు. కొవిడ్, ఒమిక్రాన్ బారిన పడినవారిలో ఎక్కువ మందికి ఇలాంటి లక్షణాలే ఉండటం జనాల భయానికి కారణంగా తెలుస్తోంది.
చలి కాలం కాబట్టి జలుబు వంటి లక్షణాలు సాధారణంగా వస్తున్నాయా? (Winter effect on Corona) లేదా కొవిడ్ జలుబు, జ్వరం వంటి లక్షణాలు కొవిడ్ సోకిందనేందుకు సంకేతాలా? అనే విషయంపై వైద్య నిపుణులు ఏముంటున్నారో ఇప్పుడు (Health Experts on Corona symptoms) చూద్దాం.
సాధారణంగా ఫ్లూ, వైరల్ సమస్యలు ఉంటే.. జ్వరం రావడం సహజమేనంటున్నారు వైద్య నిపుణులు, అయితే అది కరోనా భావించడం పొరపాటు అని (Only fever is not Cornoa) అంటున్నారు.
జ్వరం మాత్రమే వస్తే కరోనా వచ్చిందని చెప్పలేమని.. అలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఆందోళన పడొద్దని సూచిస్తున్నారు. జ్వరంతో పాటు.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే అవి కరోనా లక్షణాలు అయ్యే ఛాన్స్ ఉందని (Corona Common Symptoms) వివరిస్తున్నారు. అలాంటప్పుడు మాత్రమే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కొవిడ్ లక్షణాలపై కేంద్రం సూచనలు ఇలా..
కొవిడ్ లక్షణాలపై ఇటీవలే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా పలు కీలక విషయాలు వెల్లడించింది. కొవిడ్, ఒమిక్రాన్ సోకిన (Omicrona Symptoms) వారికి ఉన్న సాధారణ లక్షణాలను గుర్తించింది.
అందులో దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఊపిరి ఆడకపోవడం, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, డయేరియా వంటివన్ని కొవిడ్ లక్షణాలుగా తెలిపింది. ఈ లక్షణాలు ఉన్నవారంతా కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వెంటనే పరీక్షలు చేసుకోవాలని కూడా (Center identified corona symptoms) వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో చాలా మందికి కనీసం ఎలాంటి లక్షణాలు లేకపోవడం (Cornoa cases without Symptoms) గమనార్హం.
Also read: Kidney Disease Symptoms: కిడ్నీ వ్యాధి ప్రధాన లక్షణాలు, ఎలా గుర్తించాలి
Also read: Best Tips for Sleep: నిద్రలేమి సమస్యగా మారిందా..ఈ చిట్కాలు పాటిస్తే మంచి నిద్ర పడుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Corona symptoms: జ్వరం, జలుబు, దగ్గు కొవిడ్‌కు సంకేతాలా? చలికాలంలో అవన్నీ కామనా?
ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న కొవిడ్ భయాలు
కరోనాను ముందుగా గుర్తించడంపై వైద్యుల సూచనలు
జ్వరం, దగ్గు సహా వివిధ లక్షణాల గుర్తింపు