Natural Weight Loss Drinks: ఈ డ్రింక్స్ తో బెల్లీ ఫ్యాట్ మాయమవ్వటమే కాదు.. ఫిట్ & స్లిమ్ గా అవుతారు

Weight Loss Drinks: అధిక బరువు నుంచి విముక్తి పొందడమనేది అంత సులభమైన పని కాదు. అందుకే చాలామంది వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. వ్యాయామం, డైటింగ్, వర్కవుట్స్ ఇలా ఎన్ని చేసినా ఆశించిన ఫలితాలుండవు

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 21, 2023, 11:45 AM IST
Natural Weight Loss Drinks: ఈ డ్రింక్స్ తో బెల్లీ ఫ్యాట్ మాయమవ్వటమే కాదు.. ఫిట్ & స్లిమ్ గా అవుతారు

Natural Healthy Weight Loss Drinks: ఆధునిక జీవన విధానంలో ఎదురౌతున్న ప్రధానమైన సమస్యల్లో ఒకటి స్థూలకాయం. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఒక్కోసారి ఫలితముండదు. అందుకే ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాకుండా డైటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇలా చేయడం వల్ల చాలావరకూ స్థూలకాయం సమస్య తగ్గించుకోవచ్చు. ఎందుకంటే 24 గంటలూ జిమ్‌లో గడపడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకే వ్యాయామంతో పాటు కొన్ని సూపర్ డ్కింక్స్ డైట్‌లో ఉంటే చాలా సులభంగా అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు. ఈ సూపర్ డ్రింక్స్ ప్రబావంతో బెల్లీ ఫ్యాట్ సమస్య కూడా క్షణాల్లో మాయమౌతుంది.

బ్లాక్ కాఫీ

కాఫీ లేదా టీ అనేది చాలామంది తాగేదే. అయితే ఈ రెండింటితో ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలుంటాయి. అందుకే షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుంటే చాలా మంచిది. బ్లాక్ కాఫీలో కేలరీలు తక్కువగా ఉండి బరువు తగ్గించేందుకు దోహదపడుతుంది. శరీరంలో మెటబోలిజం వృద్ది చెందుతుంది. మెటబోలిజం ఎప్పుడైతే అభివృద్ధి చెంది వేగవంతమౌతుందో బెల్లీ ప్యాట్ లేదా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీనికోసం రోజుకు 2 కప్పుల బ్లాక్ కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో వివిధ రకాల న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ఎసిటిక్ యాసిడ్ కొవ్వును శరవేగంగా కరిగిస్తుంది. ఈ డ్రింక్ సహాయంతో ఇన్సులిన్‌ను తగ్గించవచ్చు. ఇంట్లోనే సులభంగా ఆపిల్ సైడర్ వెనిగర్ అందుబబాటులో ఉంచుకోవాలి.

Also Read: Fit and Health Tips: రోజూ తేనెను ఇలా సేవిస్తే ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు, ఒబెసిటీ దూర

గ్రీన్ టీ

గ్రీన్ టీ అనేది అత్యంత ఉపయోగకరమైన హెల్త్ డ్రింక్. ఈ హల్త్ డ్రింక్ రోజూ తీసుకుంటే మంచి ఆరోగ్యం కలగడమే కాకుండా వివిధ రకాల సమస్యలు దూరమౌతాయి. ఇందులో ఎపిగైలోకెటోచిన్ అనే యాంటీ ఆక్సిడెంటు కారణంగా అక్కడుండేవారికి క్రమం క్రమంగా బరువు తగ్గుతారు. అయితే చాలా కాలం నుంచి గ్రీన్ టీ అనేది దాదాపుగా తగ్గిపోయింది. అధిక బరువు సమస్యకు చెక్ పెట్టాలంటే రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ తాగాలి. 

Also Read: Garlic Side Effects: వెల్లుల్లి పరిమితి దాటి తింటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News